Anaganaga Oka Rowdy : ‘అనగనగా ఒక రౌడీ’ రెడీ అవుతున్నాడు..

వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’..

Sumanth Anaganaga Oka Rowdy Movie Ready To Release

Anaganaga Oka Rowdy: వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది.వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఐమా నాయికగా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని మేకర్స్ తెలిపారు. మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్.కె.రాబిన్, సహ నిర్మాత: యెక్కంటి రాజశేఖర్ రెడ్డి, రచన-దర్శకత్వం: మను యజ్ఞ..