Justice UU Lalit : సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ UU లలిత్‌

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా జస్టిస్ యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.

sc  cji recommendation on successor justice uu lalit : సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు (2022) 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక కానున్నారనే దాని పైన క్లారిటీ వచ్చింది. జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే అంశం పై కేంద్ర కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ ద్వారా ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి అభిప్రాయం కోరింది. దీని పైన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశమైంది. ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీ పై చర్చించింది.

నూతన సీజేఐ ఎంపికపై కసరత్తు సీజేఐ గా ఎన్వీ రమణ స్థానంలో తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నియామకం దాదాపు ఖరారైంది. దీంతో లలిత్ ఆగస్టు 27న సుప్రీం 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన సీజేఐగా లలిత్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి సీజేఐ ఎన్వీ రమణ కార్యాలయానికి సమాచారం అందింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ 2021 ఏప్రిల్ 21న బాధ్యతలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా సీజేఐ హోదాలో ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో పలు రాష్ట్రాల్లో న్యాయమూర్తుల కొరతను అర్థం చేసుకున్న ఎన్వీ రమణ ఆ స్థానాలను భర్తీ చేయటంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆయా హైకోర్టులకు పలువురు న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి.

అలాగే పదవీ విరమణ సమయంలో కూడా న్యాయమూర్తుల భర్తీ విషయంపై ఫోకస్ పెట్టారు. ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న న్యాయమూర్తుల కేటాయింపు..ఖాళీల భర్తీ..కోర్టులకు మౌళిక వసతుల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సుప్రీం కొలీజయం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ శాఖ.. సీజేఐ అభిప్రాయం పరిగణలోకి తీసుకొని అధికారికంగా నూతన సీజేఐ నియామకం పైన రాష్ట్రపతికి సిఫార్సు చేయనుంది. రాష్ట్రపతి ఆమోదంతో గజెట్ జారీ కానుంది.

సీజేఐ గా నియమితులు కానున్న జస్టిస్ లలిత్ నవంబరు 9, 1957న జన్మించారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు. లలిత్‌ ఉన్నారు.తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని..రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్ సభ్యుడిగా ఉన్నారు.

అలాగే కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది. పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా వ్యవహరించిన జస్టిస్ లలిత్..నియామకం ఆ పదవికి వన్నె తేనుంది అని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. లలిత్ మూడు నెలల పాటు ఆ హోదాలో పని చేసి నవంబర్ 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్ లలిత్..
1957 నవంబరు 9న జన్మించిన ఆయన జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.

..

 

ట్రెండింగ్ వార్తలు