Suriya: ప్రపంచం మొత్తాన్ని వణికించి.. ఇళ్లలో కూర్చోబెట్టిన మహమ్మారి కరోనా వైరస్.. ఇంకా అక్కడో ఇక్కడో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అప్పుడు వేలల్లో నమోదయ్యే కేసులు సున్నా తగ్గించి వందల్లో నమోదవుతున్నాయంతే. ఇటీవల తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ మహమ్మారి సూర్యకు కూడా వ్యాపించింది.
ఈ విషయాన్ని తానే ట్విట్టర్ అధికారిక అకౌంట్ ద్వారా తెలియజేస్తూ.. ‘నాకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మన జీవితాలు ఇంకా సాధారణ స్థితికి చేరుకున్నాయని అనుకోవడం లేదు. భయంతో ఆగిపోవాల్సిన పనిలేదు. అదే సమయంలో సేఫ్టీ, అటెన్షన్ అనేవి చాలా ముఖ్యం. నాకు సపోర్ట్ చేసి నాతో ఉంటున్న ఫిజిషియన్లకు, డాక్టర్లకు ప్రేమతో కూడిన థ్యాంక్స్ చెబుతున్నా’ అని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ ను ఫిల్మ్ మేకర్ రాజశేఖర్ పాండియన్ షేర్ చేశారు. ‘డియర్ బ్రదర్స్, సిస్టర్స్ అన్న (సూర్య) బాగానే ఉన్నారు. బాధపడాల్సిన పనిలేదు’ అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ లు షేర్ అయిన కాసేపటికే అభిమానులు.. కామెంట్ సెక్షన్లో ఈ సౌత్ యాక్టర్ గురించి త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. సూర్య రీసెంట్ గా మణిరత్నం నిర్మాణంలో రెడీ అవుతున్న నవరసకు సంతకం పెట్టారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోయే ఈ సినిమాను గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తున్నారు.