×
Ad

Sushant Singh Rajput : డ్రగ్స్ కేసులో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఫ్రెండ్ అరెస్ట్‌..

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది.. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు..

  • Published On : May 28, 2021 / 04:07 PM IST

Sushant Singh Rajput Friend

Sushant Singh Rajput: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.

గతేడాది జూన్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విషయంలో ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ పితాని, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితుడు.. అతనితో పాటు ఫ్లాట్‌లో ఉంటూ.. కొంత కాలంగా సుశాంత్‌కు పిఆర్ గా కూడా పని చేశాడు సిద్ధార్థ్..

అతని అరెస్ట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలజడి మొదలైంది.. కీలక సమాచారం మరియు సాక్షాధారలతోనే ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద మరింత సమాచారం దొరకనుందని వారు భావిస్తున్నారు..