Thief Cooks Khichdi In The Middle Of Burglary, Arrested
Takkari thief.. Cooks Khichdi : ఓ ఇంట్లో చొరబడ్డ దొంగ అందినకాడికి అన్ని మూట కట్టుకున్నాడు. తిన్నగా ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ఓవర్ యాక్షన్ చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఇంట్లో అన్ని దోచుకున్నాక ఆకలేసిందేమో పాపం..తాపీగా కిచెన్ లోకి వెళ్లాడు. కిచిడీ వండుకుందామని కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాడు. వండటం ప్రారంభించాడు. వంట చేసే క్రమంలో శబ్దాలు వచ్చాయి. అంతే ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫోన్ చేయటంతో ఆ దొంగ అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన ఫన్నీ ఘటన అస్సోంలో జరిగింది.
Read more : చోరీ కోసం వెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడు..ఆ తరువాత ఏం జరిగిందంటే..
సోమవారం (జనవరి10,2022) రాత్రి అసోంలోని గుహవాటిలోని ఓప్రాంతంలో తాళం వేసిన ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు. వచ్చినందుకు బాగానే పని జరిగిందని సంతోషించి ఇక ఇంటి నుంచి వెళ్లిపోదామనుకున్నాడు. కానీ బాగా ఆకలిగా అనిపించింది. ఏముంది ఇంట్లో ఎవ్వరు లేరు కదా..నన్నెవరు పట్టుకుంటారులే అని నిర్లక్ష్యంతో తాపీగా కిచెన్‌లోకి వెళ్లాడు. త్వరగా అయిపోయే వంటకం కిచిడి వండటానికి సరుకులన్నీ తీసుకున్నాడు. వండటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వంట పాత్రల శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారికి మెలకువ వచ్చింది. ఆ ఇంటివారు లేరు కదా..శబ్దాలు వస్తున్నాయేంటీ..దొంగలు దూరారు అనుకుని వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫోన్ చేశారు.
Read more : Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిలోకెళ్లి చూసేసరికి అప్పటికే పోలీసులు వచ్చారనే భయంతో పారిపోదామనుకున్న సరదు దొంగగారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగతనం ఘటనపై అసోం పోలీసులు చాలా చమత్కారంగా ట్వీట్ చేశారు.
కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. కిచిడీ వండే దొంగను అరెస్ట్ చేశాం. పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దొంగగారి పని ఎలా ఉన్నా..పోలీసుల ట్వీట్ మాత్రం సూపర్బ్ గా ఉంది..
కాగా గతంలో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సతీస్ అనే యువకుడు ఓ ఇంట్లో ఏమీ దొరకలేదు. కానీ ఘుమఘుమలాడే చేపలకూర ఉండటంతో దాంతో ఫుల్ గా భోజనం లాగించేశాడు.ఆనక నిద్ర వచ్చి నిద్రపోయాడు. తెల్లవారిపోయింది. ఇంటి యజమాని వచ్చాడు..గుట్టు అంతా బయటపడింది.