Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

దొంగలు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ఇంటికే కన్నం వేశారు.అక్కడ వారికి ఆశించినంత డబ్బులు దొరకకపోవటంతో..‘ఇంట్లో డబ్బుల్లేకుంటే తాళం ఎందుకు వేశారు?’ అని ప్రశ్నిస్తు లెటర్ రాసిపెట్టారు.

Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

Thieves' Letter To Deputy Collector

“If there was no money.. Thieves’ letter to Deputy Collector : మధ్యప్రదేశ్ లో దొంగలు ఎంతకు తెగించారంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్ఇంటికే కన్నం వేశారు. పైగా కలెక్టర్ గారి ఇల్లు పోలీసు సూరింటెండెంట్ ఇంటికి కూతవేటు దూరంగా ఉంది. కానీ దొంగలకు ఏమాత్రం భయం లేకుండా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు. ఇంట్లోకి దర్జాగా చొరబడిని దొంగలు ఇల్లంతా గాలించారు. కానీ వారికి ఎక్కడా ఆశించనంతగా డబ్బులు దొరకలేదు.దీంతో వారికి ఒళ్లు మండిపోయింది. టైమ్ అంతా వేస్ట్ అయింది అనుకుంటూ అసంతృప్తి వెళ్లగ్రక్కారు.అంతటితో ఊరుకున్నారా ఏంటీ..ఓ లెటర్ కూడా రాశారు.

ఆ లెటర్ లో ‘ఇంట్లో డబ్బుల్లేవు..మరి ఇంటికి తాళం ఎందుకు వేశారు?’ అని రాసి పెట్టి మరీ వెళ్లారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన లేఖ సంచలనంగా మారింది. భోపాల్ నుంచి 2.5 గంటల ప్రయాణంలో దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసంలో దొంగలు చొరబడ్డారు. ఇంట్లో డబ్బులేమీ దొరకకపోవటంతో వారి అమూల్యమైన సమయం వృధా అయిపోయిందట..దాంతో వారు ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ లో “జబ్ పైసే నహీ వారు తో లాక్ నహీ కర్నా థా నా కలెక్టర్ (ఇంట్లో డబ్బు లేనట్లయితే, మీరు దానిని లాక్ చేయకూడదు, కలెక్టర్),”అని ఇంటి యజమాని డిప్యూటీ కలెక్టరును ప్రశ్నిస్తూ దొంగలు లేఖ రాసి వదిలి వెళ్లారు.

చోరీ జరిగిన డిప్యూటీ కలెక్టరు ఇల్లు దేవాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రదీప్ సోని, జిల్లా పోలీసు సూరింటెండెంట్ నివాసాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. కాగా.. డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ గత 15 నుంచి 20రోజులుగా ఇంట్లో లేరు. ఊరి నుంచి వచ్చాక చూస్తే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం..ఇంట్లో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో త్రిలోచన్ గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.త్రిలోచన్ గౌర్ ప్రభుత్వ నివాసం నుంచి దొంగలు రూ. 30,000 నగదు,కొన్ని ఆభరణాలు దొంగిలించారు.ఇంట్లో దొంగలు లేఖ వదిలివెళ్లారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టరు ఉమ్రావ్ సింగ్ చెప్పారు.