‘తట్టుకోలేకపోతున్నాం తమన్నా’..

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది.. దశాబ్దకాలానికి పైగా తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నా, కెరీర్ ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉందో 30 ప్లస్ లోనూ అదే గ్రేస్‌ మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల కోవిడ్‌కు గురై కోలుకున్న తమన్నా ఆ తర్వాత ఎప్పటిలానే ఫిజిక్‌పై ఫోకస్ పెట్టి ఇంతకుముందున్న ఫిట్‌నెస్ తిరిగి సాధించింది.

తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తమన్నా, ‘‘The body achieves what the mind believes’’ అంటూ అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. ‘మరీ ఇంత అందమా.. తట్టుకోలేకపోతున్నాం తమన్నా’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా తెలుగులో గోపిచంద్ ‘సీటీమార్’ మూవీలో కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపించనున్న మిల్కీ బ్యూటీ ఇటీవలే ‘ఎఫ్ 3’ షూటింగులో జాయిన్ అయ్యింది.. ‘సీటీమార్’ ఏప్రిల్ 2న, ‘ఎఫ్ 3’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు