Tamannaah : తన కాబోయే భర్తని పరిచయం చేసిన తమన్నా.. చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజెక్ట్ లనే పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో ఈ అందాల భామ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

Tamannaah introduced her fiance

Tamannaah : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజెక్ట్ లనే పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో ఈ అందాల భామ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

Tamannaah: గోల్డ్ రంగు చీరలో తళుక్కుమంటున్న తమన్నా..

అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. తాను ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడబోతున్నట్లు వస్తున్న వార్తలకు తమన్నా బదులిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ పెట్టింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ‘F3’ మూవీలో తమన్నా మేల్ గెటప్ లో కనిపించిన విషయం మనకి తెలిసిందేగా, ఇప్పుడు మళ్ళీ ఆ గెటప్ లో కనిపిస్తూ.. “ఇతనే నేను చేసుకోబోయే ఆ బిజినెస్ మ్యాన్” అంటూ కౌంటర్ ఇస్తూ కాప్షన్ పెట్టింది.

కాగా ప్రస్తుతం తమన్నా హిందీ, మలయాళంలో ఒకొక సినిమా చేయగా, అవి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ ‘వేదలమ్’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది.