తేజ ‘చిత్రం’ కి సీక్వెల్ వస్తోంది!..

Chitram 1.1: దర్శకుడు తేజ కెరీర్ కి పునాది వేసిన ‘చిత్రం’.. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చిత్రం’.. ‘‘చిత్రం’’.. ఉదయ్ కిరణ్, రీమా సేన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ మూవీ వచ్చిన 21 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ కి సీక్వెల్ తియ్యనున్నట్లు తేజ ప్రకటించారు.

ఫిబ్రవరి 22 తేజ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి ‘చిత్రం 1.1’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 45 మంది కొత్త వారిని పరిచయం చెయ్యబోతున్నానని, మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని తేజ చెప్పారు.

ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు.
హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి..