Thalapathy 65 : దళపతి 65 ప్రారంభం.. ఫస్ట్‌టైమ్ విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే..

‘మాస్టర్’ తర్వాత దళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమా బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ -తెలుగులో ‘కో కో కోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

Thalapathy 65

Thalapathy 65: ‘మాస్టర్’ తర్వాత దళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమా బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ -తెలుగులో ‘కో కో కోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న 65వ సినిమా ఇది. పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ విజయ్‌తో జతకడుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమానికి దళపతితో సహా మిగతా యూనిట్ అంతా పాల్గొన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టు ప్రేక్షకాభిమానులను అలరించేలా మంచి కమర్షియల్ సినిమాతో దర్శకుడు దిలీప్ సూపర్‌హిట్ కొట్టబోతున్నారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.