Thalapathy Vijay New Movie Titled As Beast First Look Poster Out
Vijay – Beast First Look: తమిళ స్టార్, ఇళయ దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేశారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్టర్’ సూపర్‌హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ (కో కో కోకిల), శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ మూవీస్ చేసి, చక్కటి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న 65వ సినిమా ఇది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ విజయ్‌తో జతకడుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
దళపతి కొత్త సినిమాకి ‘బీస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బనియన్ వేసుకుని, రఫ్ లుక్‌లో, చేతితో గన్‌తో విజయ్ లుక్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో #BEASTFirstLook #Thalapathy65FirstLook హ్యాష్ ట్యాగ్స్‌తో విజయ్ ‘బీస్ట్’ ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘బీస్ట్’ త్వరలో విడుదల కానుంది.
#Thalapathy65 is #BEAST@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja#BEASTFirstLook #Thalapathy65FirstLook pic.twitter.com/Wv7wDq06rh
— Sun Pictures (@sunpictures) June 21, 2021