Dhanush – Sekhar Kammula : క్రేజీ కాంబో.. ధనుష్ – శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం..
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది.. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..
- sekhar
- Published On : June 18, 2021 / 10:47 AM IST
Dhanush – Sekhar Kammula
Dhanush – Sekhar Kammula: ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
ధనుష్‌తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్టిర్ ద్వారా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్‌పీ బ్యానర్ మీద నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు.. ఈ క్రేజీ మూవీని నిర్మించనున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ములతో రీసెంట్‌గా ఈ నిర్మాతలు.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమాను నిర్మించారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.
The Two Men who believes in Content & Commitment ✨
The National Award Winners? @dhanushkraja & @sekharkammula collaborating for A Telugu-Tamil-Hindi
Tri-Lingual ProjectProduced by #NarayanDasNarang & #PuskurRamMohanRao in @SVCLLP pic.twitter.com/x40jqXUItP
— BARaju’s Team (@baraju_SuperHit) June 18, 2021
