Movie Trailers : ఈ టైంలో విడుదల వద్దు.. వాయిదా వేద్దాం..

టాలీవుడ్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సినిమా రిలీజ్‌ల విషయంలో కాదు.. ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసే టీజర్స్, ట్రైలర్స్ విషయంలో.. ఇప్పట్లో థియేటర్ సందడి కనిపించేలా లేదు.. కనీసం టీజర్స్ అయినా చూడాలనుకుంటున్న ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది..

Tollywood Upcoming Movie Trailers Postponed Due To Covid 19 Second Wave

Movie Trailers: టాలీవుడ్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సినిమా రిలీజ్‌ల విషయంలో కాదు.. ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసే టీజర్స్, ట్రైలర్స్ విషయంలో.. ఇప్పట్లో థియేటర్ సందడి కనిపించేలా లేదు.. కనీసం టీజర్స్ అయినా చూడాలనుకుంటున్న ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది. మరి మే 31న రాబోతున్న ‘సర్కారు వారి పాట’ సంగతేంటి..?

ప్రజలు బాధపడుతోన్న టైంలో సందడి చేయలేనంటున్నారు సూపర్‌స్టార్. మే 31న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు ‘సర్కారు వారి పాట’ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ లేదంటున్నారు మేకర్స్. మహేష్ బాబు నటిస్తున్న ఏ కొత్త సినిమా అయినా మే 31 సూపర్‌స్టార్ కృష్ణ గారి బర్త్‌డే స్పెషల్‌గా ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, టీజర్ వంటివి రిలీజ్ చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేశారు డైరెక్టర్ పరశురామ్. కానీ కరోనా ఉధృతి కారణంగా ‘సర్కారు వారి పాట’ టీజర్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది.

మే 9న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్‌డే కానుకగా ‘లైగర్’ టీజర్ వస్తుందనుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితులు.. జనం పడుతోన్న ఇబ్బందుల కారణంగా ‘లైగర్’ సినిమా టీజర్ వాయిదా వేశారు. ప్రజలు మళ్లీ ఆనందంగా గడిపే టైంలో ‘లైగర్’ వస్తాడంటూ ప్రకటించారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన నాని ‘టక్ జగదీష్’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’, మేలో వస్తారనుకున్న మెగాస్టార్ ‘ఆచార్య’, విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమాల ట్రైలర్స్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. కరోనా తగ్గి రిలీజ్ డేట్స్ ఫిక్సయ్యాక కానీ ట్రైలర్స్‌తో ముందుకొచ్చేలా లేరు దర్శక నిర్మాతలు. అలాగే ఎప్పటినుంచో ఊరిస్తున్న ‘రాధే శ్యామ్’ ఫుల్ టీజర్ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ మధ్యలో మాత్రం అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్‌’ గా వచ్చి ఫ్యాన్స్‌కి కావాల్సినంత ట్రీట్ ఇచ్చారు..