Still Water : క్రైమ్ డ్రామా ‘స్టిల్ వాటర్’ ట్రైలర్.. జూలై 30 రిలీజ్..

అకాడమీ అవార్డ్ విన్నర్ టామ్ మెక్‌క్యార్తి (Tom McCarthy) డైరెక్ట్ చేస్తున్న ‘స్టిల్ వాటర్’ (Still water) ఈ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది..

Tom Mccarthy Still Water Movie Trailer

Still Water: కరోనా దెబ్బకి హాలీవుడ్ ఇండస్ట్రీ వేలాది కోట్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది.. ప్యాండమిక్ తర్వాత క్రిస్టోఫర్ నోలెన్ ‘టెనెట్’ (TENET), ఆడమ్ విన్‌గార్డ్ ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ (Godzilla vs. Kong) సినిమాలు బాక్సాఫీస్ బరిలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాయి..

ఇంతలో మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితి మొదటికొచ్చింది.. స్కార్లెట్ జాన్సన్ (Scarlett Johansson) నటిస్తున్న ‘వండర్ వుమెన్’ మూవీని జూలై 9న ఇంగ్లీష్‌తో సహా మొత్తం ఆరు భాషల్లో భారీస్థాయిలో విడుదల చెయ్యనున్నారు. ఇప్పుడు మరో హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అకాడమీ అవార్డ్ విన్నర్ టామ్ మెక్‌క్యార్తి (Tom McCarthy) డైరెక్ట్ చేస్తున్న ‘స్టిల్ వాటర్’ (Still water) ఈ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మాట్ డామన్, కెమిల్లె కాటిన్ మెయిన్ లీడ్స్‌గా నటించారు. క్రైమ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘స్టిల్ వాటర్’ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌ని బేస్ చేసుకుని, ఎమోషన్‌తో కూడిన సస్పెన్స్‌తో ఉండబోతోందని ట్రైలర్‌లో చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సూట్ అయ్యాయి.. 2021 జూలై 30న ‘స్టిల్ వాటర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..