Delay Movies: రెండేళ్ల నుంచి నానుతూనే ఉన్నాయి..

అప్పుడెప్పుడో కరోనా రాకముందు మొదలు పెట్టిన మిడిల్ రేంజ్ సినిమాలు అటు త్వరగా కంప్లీట్ చెయ్యలేక.. అలా అని కంటిన్యూ చెయ్యలేక రెండేళ్ల నుంచి నానుతూనే ఉన్నాయి..

Top Movie Shootings Continue From Last 2 Years

Delay Movies: చిన్న సినిమాలు ఎలాగూ షార్ట్ పీరియడ్‌లోనే కంప్లీట్ అవుతాయి. పెద్ద సినిమాలు ఎలాగూ టైమ్ తీసుకుంటాయి. కానీ అప్పుడెప్పుడో కరోనా రాకముందు మొదలు పెట్టిన మిడిల్ రేంజ్ సినిమాలు అటు త్వరగా కంప్లీట్ చెయ్యలేక.. అలా అని కంటిన్యూ చెయ్యలేక రెండేళ్ల నుంచి నానుతూనే ఉన్నాయి.

కోవిడ్ వల్ల పెద్ద సినిమాలు ఎక్కువ టైమ్ తీసుకున్నా.. చిన్న సినిమాలు మాత్రం ఫినిష్ చేసేసుకుంటున్నారు. కొన్ని మిడిల్ రేంజ్ సినిమాలు మాత్రం కరోనా ముందు మొదలుపెట్టారు.. కానీ, కరోనా సెకండ్ వేవ్ వచ్చినా కూడా కంప్లీట్ చెయ్యకుండా నానుస్తూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ ఫాస్ట్‌గా సినిమా కంప్లీట్ చేసే పూరీ జగన్ అయితే 2019లో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా స్టార్ట్ చేశారు. కానీ 2021 వచ్చినా ఇంకా సినిమా సగం కూడా కంప్లీట్ కాలేదు.

ఒక సినిమాకీ మరో సినిమాకీ బాగా టైమ్ తీసుకుని చేసే శేఖర్ కమ్ముల.. సినిమా స్టార్ట్ చేశారంటే మాత్రం చకచకా ఫినిష్ చేస్తారు కానీ.. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ మాత్రంఇంకా రిలీజ్‌కి రాలేదు. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావడానికి పడిగాపులు పడుతూనే ఉంది.

సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న రానాకి కూడా కొన్ని సినిమాలు టైమ్ తీసుకుంటున్నాయి. వేణు ఊడుగుల డైరెక్షన్లో రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సెన్సిబుల్ లవ్ స్టోరీ ‘విరాట పర్వం’ సినిమా కూడా కరోనా ఫస్ట్ వేవ్‌కు ముందు స్టార్ట్ అయ్యింది. కానీ ఇంకా సినిమా ఆడియన్స్ ముందుకు మాత్రం రాలేదు.

వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో కెరీర్‌లో సఫర్ అవుతున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్.. బాగా టైమ్ తీసుకుని చేస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్, పూజా హెగ్డే క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మిడ్ రేంజ్ సినిమా కూడా 2019 లోనే మొదలైంది. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోకుండా డిలే అవుతూనే ఉంది.

ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఎప్పుడూ రెడీగా ఉండే సీనియర్ హీరో వెంకటేష్ కూడా సినిమాల్ని ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తారు. కానీ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దాదాపు ఎప్పుడో మొదలైన ‘నారప్ప’ సినిమా మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌కి జంటగా ప్రియమణి నటిస్తోంది.

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడతున్న గోపీచంద్ సినిమా కూడా సాగుతూనే ఉంది. సంపత్ నంది డైరెక్షన్లో ఈ సారి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సీటీ మార్’ మూవీ ఇంకా కంప్లీట్ కాలేదు. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తమన్నా హీరోయిన్‌గా మొదలైన సినిమా ఇంకా ఫినిషింగ్ టచెస్ కోసం వెయిట్ చేస్తోంది.