కరోనా వైరస్ పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో మూడు రకాల యాంటీ వైరల్ డ్రగ్‌లు కలిపి ఇస్తే కరెక్ట్‌గా పనిచేస్తున్నాయని హాంకాంగ్ డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరిన్ని టెస్టులు చేసి కన్ఫార్మ్ చేసుకుంటామని.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించొచ్చని వైద్యులు అంటున్నారు. వైరస్ తీవ్రతను తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా రెమ్‌డెసివర్ వాడుతుండగా దీని సరఫరా ఎక్కువగా లేదు.
హాంకాంగ్ యూనివర్సిటీలో పనిచేసే డా.క్వాక్ యంగ్, అతని కొలీగ్స్ హెచ్ఐవీ డ్రగ్ కాంబినేషన్ తో పాటు రిటోనవీర్, లొపానవీర్ ను యాంటీ వైరల్ డ్రగ్ గా వాడుతున్నారు. జనరల్ యాంటీ వైరల్ డ్రగ్ అయిన రిబావిరిన్ వ్యాధికారక వైరస్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈ ట్రిపుల్ డ్రగ్ థెరఫీతో కొవిడ్-19 పాజిటివ్ లక్షణాలున్న పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తే ఏడు రోజుల్లో కోలుకుంటున్నారు. పేషెంట్లను ట్రీట్ చేయడంలో ఈ కోర్సు త్వరగా ఫలితాలను ఇస్తుందని వైద్యులు అంటున్నారు.
యూన్స్ టీం కొందరు పేషెంట్లకు కేవలం హెచ్ఐవీ డ్రగ్ మాత్రమే ఇస్తూ వస్తుంది. కలెట్రా అనే బ్రాండ్ మందును మాత్రమే వాడుతున్నారు. లొపినవీర్-రిటోనవీర్ కాంబినేషన్ తో పాటు యాంటీ వైరల్ డ్రగ్ రిబావిరిన్ ను ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నారు.
కొందరు పేషెంట్లలో ఏడు రోజులకే కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. హెచ్ఐవీ డ్రగ్స్ వాడిన పేషెంట్లకు అదే రిపోర్టు రావడానికి 12రోజుల సమయం పట్టింది. ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గడంతో పాటు సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉంటాని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వ్యాధిని త్వరగా తగ్గించేందుకు రోగి పరిస్థితిని బట్టి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.
Read Also | ఆ 19 దేశాల నుంచి స్వదేశానికి భారతీయులు