మహిళామణులతో ‘టక్ జగదీష్’..

  • Updated on- March 8, 2021 / 03:47 PM IST

Tuck Jagadish – Womans Day: నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’..

నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాని ఓ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో షేర్ చేశారు. ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్న మహిళలందరితో కలిసి నాని సందడి చేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు, నాని అన్నయ్యగా కనిపించనున్నారు. 2021 ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.