Twitter ఉద్యోగులకు పర్మినెంట్‌గా Work from Home 

  • Publish Date - May 13, 2020 / 06:39 AM IST

టాప్ సోషల్ మీడియాలో కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్.. ఉద్యోగులకు పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించనుంది. కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ట్విట్టర్ వర్క్ కల్చర్ నచ్చడంతో ప్రపంచ వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు పర్మినెంట్‌గా work from home ఇవ్వనుంది. 

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఇప్పటికే 4.2మిలియన్ మందికి వ్యాపించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాపారాలు సాగడానికి లాక్‌డౌన్ కఠినంగా ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. సోషల్ మీడియా కంపెనీ అయిన ట్విట్టర్ సెప్టెంబరు వరకూ ఆఫీసులు ఓపెన్ చేసేది లేదని ముందుగానే నిర్ణయించారు. 

సెప్టెంబరు కంటే ముందు ఎటువంటి బిజినెస్ ట్రావెల్స్ ఉండవని ట్విట్టర్ వెల్లడించింది. 2020 ఆసాంతం కంపెనీలో ఒక్క వ్యక్తి కూడా కనిపించడని తాజాగా పేర్కొంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్, గూగుల్ ఉద్యోగులకు సంవత్సరం చివరి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. 

Read Here>> Facebook, Google ఉద్యోగులకు సంవత్సరం చివరి వరకూ Work from Home