Strange things in Uber cabs : సోమవారం ఛార్జర్లు, మంగళవారం తాళాలు, బుధవారం వాలెట్‌లు.. ఊబర్ ఎక్కితే మర్చిపోతారట..

క్యాబ్ ఎక్కగానే ఫోన్లలో ముగినిపోతారు. దిగేటపుడు ఏదో ఒక వస్తువుని మర్చిపోతారు. ఆనక అది ఇంక దొరకక నానా హైరానా పడతారు. ప్రయాణికులు పోగొట్టుకునే వస్తువుల్లో కొన్ని వింత వస్తువులు కూడా ఉంటాయట. తాజాగా ఊబర్ లిస్ట్ పోస్ట్ చేసింది.

Strange things in Uber cabs

Strange things in Uber cabs :  ఇంట్లో వెహికల్ ఉన్నా కొన్నిసార్లు క్యాబ్ బుక్ చేసుకోవడం కామనే. అయితే ఈ క్యాబ్ లు ఎక్కేటపుడు, దిగేటపుడు కొందరు తమ వస్తువుల్ని అందులో మర్చిపోతుంటారు. ఫోన్‌లు, వాలెట్‌లే కాదు.. కొంతమంది ప్రయాణికులు విచిత్రమైన వస్తువుల్ని కూడా వదిలిపెడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఊబర్ వెల్లడించింది.

Thane: రాత్రి కాబట్టి రూ.10 ఎక్కువ అడిగితే ఇవ్వనన్నందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆటోడ్రైవర్

రీసెంట్‌గా ఊబర్ ‘ది 2023 లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్’ ఏడవ ఎడిషన్‌ని రిలీజ్ చేసింది. అందులో జనం తమ క్యాబ్‌లలో ఎలాంటి వస్తువుల్ని మర్చిపోతున్నారో వివరించింది. ఇక అవేంటో తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీవంతు. ఫాగ్ మెషీన్, ప్రెగ్నెన్సీ టెస్ట్, నకిలీ దంతాలు క్యాబ్‌లలో వదిలిపెడుతున్నారట. బట్టలు, ఫోన్‌లు, తాళాలు, వాలెట్ , సిక్స్ చీజ్ కేక్ ఇవి కూడా లిస్ట్ లో ఉన్నాయి మరి. ఇక క్యాబ్‌లలో వస్తువుల్ని మర్చిపోయే నగరాల్లో ఫ్లోరిడాకు చెందిన జాక్సన్ విల్లే మొదటి స్ధానంలో నిలిచింది. శాన్ ఆంటోనియో, టెక్సాస్, కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్ వరుసగా తరువాత స్ధానాల్లో నిలిచాయి.

 

ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలని ఉందా? సోమవారం ఛార్జర్లు, మంగళవారం తాళాలు, బుధవారం వాలెట్‌లు, గురువారం డబ్బులు, శుక్రవారం వాచ్‌లు, నగలు మర్చిపోతున్నారట. వీకెండ్‌లో మాత్రం పాస్ పోర్టులు, కిరాణా సామాన్లు మర్చిపోతున్నారు. ఇలా  ఏప్రియల్ 5, 2022 న ఒక్కరోజులో తమ క్యాబ్‌లలో కస్టమర్లు పోగొట్టుకున్న 1000 వస్తువుల్ని గుర్తించారట.

Bengaluru: పగలు డ్రైవర్.. రాత్రి ఫైనాన్షియల్ అడ్వైజర్.. నెట్టింట ఆసక్తిరేపుతున్న ఆటో డ్రైవర్ స్టోరి

ఊబర్ ఈ సోదంతా ఎందుకు పోస్ట్ చేసిందని మీకు అనుమానం రావచ్చు.. ప్రయాణికులు తాము పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందాలంటే తమ వద్ద అందుబాటులో ఉన్న యాప్‌ల వివరాలు తెలియజేయడం కోసం అన్నమాట.