Bengaluru: పగలు డ్రైవర్.. రాత్రి ఫైనాన్షియల్ అడ్వైజర్.. నెట్టింట ఆసక్తిరేపుతున్న ఆటో డ్రైవర్ స్టోరి

సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్‭ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ్లేషణలు చేసే యూట్యూబ్ ఛానెల్స్ కలిగి ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక చూపులోనే ఒక ఛానెల్ చాలా సాధారణమైనదని ఎవరైనా అనుకుంటారు

Bengaluru: పగలు డ్రైవర్.. రాత్రి ఫైనాన్షియల్ అడ్వైజర్.. నెట్టింట ఆసక్తిరేపుతున్న ఆటో డ్రైవర్ స్టోరి

Bengaluru auto driver's story has surprised internet

Bengaluru: ఇండియన్ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు ఎన్నో ఆవిష్కరణలకు ఆవిష్కర్తలకు పుట్టినిల్లు. నగరంలోని ఏ సందులో వెతికినా ఒక ఎంటర్‭ప్రెన్యూర్‭ను కనుగొనవచ్చు. అయితే అలాంటి వారు ఖరీదైన భవనాల్లోనో విలాసవంతమైన విల్లాల్లోనో ఉంటారనుకుంటే పొరపాటే. చాయ్ కొట్టు దగ్గరో, ఆటో డ్రవైరుగానో కనిపిస్తుంటారు. బయటికి వారు కనిపించే వృత్తి వేరే కావొచ్చు కానీ, ఆలోచనలు మాత్రం వేరేలా ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తే బెంగళూరుకు చెందిన గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్. వాస్తవానికి ఇది అతడి అసలు పేరు కాదు. తన యూట్యూబ్ ఛానల్ పేరు. పగలేమో ఆటో డ్రవైర్. అది ముగిశాక ఆర్థిక అంశాల మీద వీడియోలు చేసి యూట్యూబులో పెడుతుంటాడు.

Kiran Bhai Patel: పీఎంవో అధికారినంటూ ఏకంగా కశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడీ కొట్టించి, 4 నెలలుగా జడ్ ప్లస్ కేటగిరీ..

ఆయన ఆటో ఎక్కినవారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం జనార్ధన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనార్ధన్ ఆటోలో వెనుక సీట్లో కూర్చున్న వారికి కనిపించేలా ఒక పాంప్లెట్ ఉంటుంది. అందులో అతడి యూట్యూబ్ ఛానల్ పేరుతో ‘దయచేసి నా యూట్యూబ్ ఛానల్‭ను సబ్‭స్క్రైబ్ చేసుకోండి’ అని రాశాడు. తీరా తెరిచి చూస్తే ఆర్థిక విషయాల మీద అద్భుత విశ్లేషణ ఉంటుందని, ఆ ఆటో ఎక్కిన ప్రయాణికులు నెట్టింట్లో చెప్పుకొస్తున్నారు.

Manish Sisodia ED Investigation : మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు

సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్‭ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ్లేషణలు చేసే యూట్యూబ్ ఛానెల్స్ కలిగి ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక చూపులోనే ఒక ఛానెల్ చాలా సాధారణమైనదని ఎవరైనా అనుకుంటారు. అయితే, జనార్దన్ యూట్యూబ్ ఛానెల్‌ని చూసి కోశి ఆశ్చర్యపోయాడట.


“కేంద్ర బ్యాంకులు డబ్బును ఎందుకు ముద్రించలేవు అనే దానిపై అతని సాధారణ వివరణ అద్భుతమైనది. నిజంగా ఆకట్టుకుంటుంది!” కోశి తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా జనార్దన్ ఛానెల్‌ని ఫాలో అవ్వడానికి గల కారణాల కూడా చెప్పుకొచ్చాడు. “ఆటోడ్రైవర్ జనార్దన్ యూట్యూబ్ ఛానెల్ చూశాను. నన్ను చాలా ఆకట్టుకుంది. అవేంటంటే.. 1. మధ్యస్థంగా సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను చెప్తున్నాడు. 2. వాటిని సామాన్యుల పరంగా వివరించాడు. 3. తన ఆటో నడుపుతూనే గ్రాఫ్‌లతో వీడియోలు మొదలైనవన్నీ చెప్పతున్నాను” అంటూ కౌశిక్ ట్వీట్ చేశాడు.