Kiran Bhai Patel: పీఎంవో అధికారినంటూ ఏకంగా కశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడీ కొట్టించి, 4 నెలలుగా జడ్ ప్లస్ కేటగిరీ..

జమ్మూ కశ్మీర్ యంత్రాంగాన్ని కిరణ్ ఎంతలా నమ్మించాడంటే.. అతడికి ప్రత్యేకంగా వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నాడంటే అధికారులు ఎంతలా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. దేశ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలను కూడా అధికారిక హోదాలో సందర్శించాడు. నియంత్రణ రేఖ సమీపంలోని ఉరి నుంచి శ్రీనగర్ లోని లాల్ చౌక్ వరకు వెళ్లాడు

Kiran Bhai Patel: పీఎంవో అధికారినంటూ ఏకంగా కశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడీ కొట్టించి, 4 నెలలుగా జడ్ ప్లస్ కేటగిరీ..

Conman posing as PMO official meets top J&K officials, visits border post

Kiran Bhai Patel: హిందీలో వచ్చిన ‘స్పెషల్-26’ అనే సినిమా గుర్తుండే ఉంటుంది. హీరో సహా మరో ఇద్దరు వ్యక్తులు తాము ఐటీ అధికారులమంటూ బురిడీ కొట్టించి, అక్రమ డబ్బును సీజ్ చేసి.. చివరికి అదే డబ్బుతో ఉడాయిస్తారు. ప్రతిసారి ఏదో ఒక ప్రభుత్వ అధికారుల అవతారం వేస్తూ.. ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉంటారు. నిజ జీవితంలో కూడా ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఇలాంటిదే జరిగింది. అయితే ఇది సినిమాను కూడా తలదన్నే రేంజులో జరగడం విశేషం. ఎందుకంటే.. ఒక వ్యక్తి తనను తాను ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారినంటూ ఏకంగా జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడీ కొట్టించాడు. వైవ్ స్టార్ అకామిడేషన్, బుల్లెట్ ఫ్రూవ్ కాన్వాయ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇలా సకల సౌకర్యాలతో సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో కూడా పర్యటించాడు. కానీ, ఎంత చేస్తే మాత్రం ఏం లాభం.. కాస్త ఆలస్యంగానైనా నిజం బయటపడాల్సిందే. చివరకు విషయం పోలీసులకు తెలిసిపోయి కటకటాల వెనక్కు వెళ్లిపోయాడు.

BJP vs Rahul: రాహుల్ గాంధీని పార్లమెంట్‭లో మాట్లాడనివ్వకూడదని నిర్ణయించుకున్న బీజేపీ

ఇంత హల్ చల్ చేసిన వ్యక్తెవరో తెలుసుకోవాలనే ఆరాటం వస్తోంది కదా.. అతడి పేరు కిరణ్ భాయ్ పటేల్. స్వస్థలం గుజరాత్. కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ అధికారులకు తాను పీఎంవోలో అడిషనల్ డైరెక్టర్ అని పరిచడం చేసుకున్నాడు. ఇక అంతే.. అక్కడి యంత్రాంగం నుంచి సకల సౌకర్యాలు పొందుతున్నాడు. గత అక్టోబర్ నుంచి ఇది కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఎడాపెడా తిరుగుతూ జడ్ ప్లస్ కేటగిరీ మధ్య రక్షణ పొందుతున్నాడు. వీవీఐపీలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని సౌకర్యాలు వాడుతున్నాడు.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

జమ్మూ కశ్మీర్ యంత్రాంగాన్ని కిరణ్ ఎంతలా నమ్మించాడంటే.. అతడికి ప్రత్యేకంగా వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నాడంటే అధికారులు ఎంతలా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. దేశ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలను కూడా అధికారిక హోదాలో సందర్శించాడు. నియంత్రణ రేఖ సమీపంలోని ఉరి నుంచి శ్రీనగర్ లోని లాల్ చౌక్ వరకు వెళ్లాడు. అతడి మాటలకు మోసపోయిన అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. ఇక అన్ని ప్రాంతాలు తిరుగుతూ నెట్టింట్లో తన పర్యటన విశేషాలు షేర్ చేస్తూ వచ్చాడు. అతడికి పారామిలిటరీ భద్రత కల్పించిన చిత్రాలు, మంచులో నడిచిన చిత్రాలు, సున్నిత ప్రాంతాల్లో పర్యటన చిత్రాలు నెట్టింట్లో షేర్ చేశాడు. అతడి సరదా పర్యటనే అతడిని మోసం చేసింది.

Ramcharitmanas controversy: రామాయణం అనే కథ ప్రకారం రాముడి కంటే రావణుడే గొప్పవాడు.. బిహార్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు వారాల్లో రెండోసారి పర్యటనకు రావడంతో నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులను అప్రమత్తం చేయడం, వారు గత చరిత్రను తోడటం చకచకా జరిగిపోయాయి. అంతే.. కిరణ్ భాయ్ బంఢారం మొత్తం బయటపడింది. అతడు వసతి ఉంటున్న హోటల్ గదిలోనే పది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. దీని మీద గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. వాస్తవానికి కిరణ్ భాయ్ కి వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ఉంది. కానీ బయోలో ఎక్కడా పీఎంవో గురించిన ప్రస్తావన లేదు. ‘థింకర్, స్ట్రాటజిస్ట్, అనలిస్ట్, క్యాంపెయిన్ మేనేజర్’ అనేవి మాత్రం ఉన్నాయి. ఇక కిరణ్ ను ట్విట్టర్ లో గుజరాత్ బీజేపీ నేతలు కొందరు ఫాలో అవుతుండడం విశేషం.