Ramcharitmanas controversy: రామాయణం అనే కథ ప్రకారం రాముడి కంటే రావణుడే గొప్పవాడు.. బిహార్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఈయన కూడా తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్ రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని అన్నారు. ఆ రెండింటినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అందుకే రాముడి గురించి ఇలా మాట్లాడకూడదని చివర్లో అనడం గమనార్హం

Jitan Ram Manjhi again rakes up Ramcharitmanas controversy
Ramcharitmanas controversy: బిహార్ విద్యాశాఖ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత చంద్రశేఖర్.. రామాచరితమానస్ మీద చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం కొంత కాలంగా వాడీవేడిగా ఉంది. ఇది కాస్త చల్లబడుతోంది అనుకునే లోపే.. ఆర్జేడీ మిత్రపక్షమైన హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన ఏకంగా రాముడిని రావణాసురుడినే కాంట్రవర్సీల్లోకి తీసుకువచ్చారు. వాస్తవానికి మాంఝీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా గతంలో రామచరితమానస్ మీద మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలే కారణం.
Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
చంద్రశేఖర్ వ్యాఖ్యల గురించి మాంఝీని ప్రశ్నించగా.. పేదోడు, ధనికుడు గురించి మాట్లాడకుండా రాముడు, రావణ గురించి మాట్లాడితే లాభమేంటని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నిజానికి రామాయణాన్ని మేము ఒక కల్పిత కథగా భావిస్తాము. ఊహాజనితం నుంచి వచ్చిన కథ అది. ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే అందులోని పాత్రలు రాముడు, రావణుడి పాత్రలను కూడా మేము కల్పితాలుగా భావిస్తాము. అయినా సరే వారిద్దరి గురించి మాట్లాడాల్సి వస్తే.. రాముడి కంటే రావణుడు చాలా పనిమంతుడు. కానీ ఇదంతా కల్పితం కాబట్టి. ఏదీ నమ్మాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
BJP vs Rahul: రాహుల్ గాంధీని పార్లమెంట్లో మాట్లాడనివ్వకూడదని నిర్ణయించుకున్న బీజేపీ
ఇక ఈయన కూడా తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్ రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని అన్నారు. ఆ రెండింటినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అందుకే రాముడి గురించి ఇలా మాట్లాడకూడదని చివర్లో అనడం గమనార్హం. ఇక ఇదే సమయంలో బీజేపీ నేతలకు జేడీయూ నేత జమా ఖాన్ ప్రశ్నలు సంధించారు. బీజేపీ నేతలు హనుమాన్ చాలిసా చదవగలరా? అసలు వారెప్పుడైనా చదివారా అని ప్రశ్నించారు. కాగా, మాంఝీ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాష్ట్ర రాజకీయాన్ని ఎంత వరకు కుదిపివేస్తుందో చూడాలి.