BJP vs Rahul: రాహుల్ గాంధీని పార్లమెంట్‭లో మాట్లాడనివ్వకూడదని నిర్ణయించుకున్న బీజేపీ

కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు. భారతీయ ప్రజాస్వామిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు

BJP vs Rahul: రాహుల్ గాంధీని పార్లమెంట్‭లో మాట్లాడనివ్వకూడదని నిర్ణయించుకున్న బీజేపీ

BJP Won't Let Rahul Gandhi Speak In Parliament Without An Apology

BJP vs Rahul: బ్రిటన్‌‭లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై కొద్ది రోజులుగా పార్లమెంట్ దద్దరిల్లుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీయేమో అదానీ అంశంపై చర్చించాలని పట్టుబడుతుండగా, రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇరు పార్టీల వాదప్రతివాదనల నడుమ కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాలు తరుచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే క్షమాపణలు చెప్పేంత వరకు రాహుల్ గాంధీని పార్లమెంటులో ప్రసంగించకుండా అడ్డుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Taapsee Vs Kangana : మరోసారి కంగనా వర్సెస్ తాప్సి.. నాకు కంగనాతో ప్రాబ్లమ్ లేదు.. ఆమెకే నాతో ప్రాబ్లమ్..

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలే తాజగా లోక్‭సభ స్పీకర్ మీద కాంగ్రెస్ పార్టీ మరోసారి చేసింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లో రాహుల్ చేత క్షమాపణలు చెప్పించాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం సైతం రాహుల్ అంశం మీదే పార్లమెంట్ మరోసారి వాయిదా పడింది. అయితే వాయిదా పర్వాలను అటు అధికార పార్టీ కానీ, ఇటు విపక్షం కాని లెక్కచేయడం లేదు. తాము డిమాండ్ చేస్తున్న అంశాలను సభలో చర్చించేందుకే ఇరు వర్గాలు మొగ్గు చూపుతున్నాయి.

Madhya Pradesh Polls: ఆ ఇద్దరు నేతల చేరడంతో కింగ్‭మేకర్‭గా మారనున్న బీఎస్పీ

ఇక కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు. భారతీయ ప్రజాస్వామిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పరస్పరం విమర్శించుకున్నాయి.

Himachal Pradesh: ఒక్కో లిక్కర్ సీసా మీద రూ.10 ‘కౌ-సెస్’ విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఇక తాజాగా లోక్‭సభ స్పీకర్‭ ఓం బిర్లాకు చెందిన ఒక వీడియో కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ముందు మైక్ ఆపేశారు. ఈరోజు సభ కార్యకలాపాలు మొత్తం మౌనంగా గడిచాయి. ప్రధాని మోదీ స్నేహితుడి కోసం పార్లమెంటులో మైకులు ఆపేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. దేశం అంటే ఒక కుటుంబం కాదని, ఒక కుటుంబం చేసే ఆరోపణలను దేశవ్యాప్త చర్చ చేయాల్సిన అవసరం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.