Manish Sisodia ED Investigation : మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.

Manish Sisodia ED Investigation : మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు

Manish Sisodia

Manish Sisodia ED Investigation : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది. ఒబెరాయ్ హోటల్ కేంద్రంగానే ఇవన్నీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. లిక్కర్ కేసుకు సంబంధించిన కీలక డిజిటల్ సాక్షాలను మాయం చేశారని పేర్కొంది. లిక్కర్ స్కామ్ సమయంలో సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని వెల్లడించింది. తమ సోదాల్లో ఒక్క ఫోన్ మాత్రమే సీజ్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.

ఇంట్రాగేషన్ లో మరో రెండు ఫోన్లను సిసోడియా జమ చేశారని పేర్కొన్నారు. 8 నెలల నుంచి వాడుతున్న ఫోన్ ను ఎల్జీ ఫిర్యాదు చేసిన తేదీనే 22.7.2022 ధ్వంసం చేశారని చెప్పారు. లిక్కర్ స్కామ్ పై, ఢిల్లీ ఎల్జీ ఫిర్యాదు చేసిన నాటి నుంచే ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే సాక్షాలను మాయం చేశారని తెలిపారు. అక్రమ నగదు చలామణికి సంబంధించిన అనేక ఆధారాలు ఈ ఫోన్లో ఉన్నాయన్నారు. ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు ఫోన్లు వాడుతున్నారని తెలిపారు.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఇదంతా రొటీన్ ప్రాక్టీస్ లో భాగంగానే చేశానని సిసోడియా ఈడీకి చెప్పారని పేర్కొన్నారు. 6 నుంచి 12% కమీషన్ పెంచాలని మంత్రుల బృందం సమావేశంలో చర్చలు ఏమి జరగలేదన్నారు. కమిషన్ పెంచాలన్న నిర్ణయంలో మద్యం శాఖ పాత్ర ఏమీ లేదు అని అధికారులు తెలిపారు. మనీశ్ సిసోడియా వ్యక్తిగత కంప్యూటర్ నుంచి జీవోఎం నోటును డౌన్లోడ్ చేశామని చెప్పారు. ఆ నోట్లో 5 శాతం కమీషన్ గురించి మాత్రమే ఉందన్నారు. సౌత్ గ్రూపు తో కుమ్మక్కు కావడంతో విచిత్రంగా నాలుగు రోజుల్లోనే పరిస్థితి మారిందన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మనీశ్ సిసోడియా తన కార్యదర్శిని పిలిపించారని పేర్కొన్నారు. ఆయన చేతికి 12 శాతం మార్జిన్ పెంచుతున్న లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రిపోర్టు చేతికి ఇచ్చారని వెల్లడించారు. ఇది 2021 మార్చి 15 నుంచి 19 మధ్యలో జరిగిందన్నారు. సౌత్ గ్రూపు సభ్యులు అదే సమయంలో ఒబెరాయ్ హోటల్లో మార్చి 14 నుంచి 17 వరకు అక్కడే మకాం వేసి ఉన్నారని తెలిపారు. ఒబెరాయ్ హోటల్ బిజినెస్ సెంటర్లో 36 పేజీల మద్యం ముసాయిదా విధానం ప్రింట్ అవుట్ తీశారని పేర్కొన్నారు.

Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు

ఈ ముసాయిదాలోనే 5 నుంచి 12 శాతం మార్జిన్ పెంచారని పేర్కొన్నారు. సౌత్ గ్రూపుతో మనీశ్ సిసోడియా కుమ్మక్కయ్యారనడానికి ఇదే ఒక పెద్ద సాక్షమన్నారు. క్యాబినెట్ కు వెళ్లడానికి రెండు రోజులు ముందే ఫైనల్ మద్యం పాలసీ సౌత్ గ్రూపు సభ్యుల మొబైల్ ఫోన్లో దొరికిందని చెప్పారు. మాజీ ఎక్సైజ్ కమిషనర్ రాహుల్ సింగ్, అమిత అరోరాను మార్చి20న విచారణకు పిలిచామని తెలిపారు. డిప్యూటీ సీఎం సెక్రటరీ అరవింద్ ను మార్చి 21వ తేదీన విచారణకు పిలిచామని పేర్కొన్నారు. వీరందరిని మనీశ్ సిసోడియాతో కలిపి విచారించాల్సివుందని తెలిపారు.