Thane: రాత్రి కాబట్టి రూ.10 ఎక్కువ అడిగితే ఇవ్వనన్నందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆటోడ్రైవర్

తన్నాడు, చెంపలపై కొట్టాడు, బూతులు తిట్టాడు. ఆటోలు ఆగిన ప్రదేశం కావడంతో ఆటో డ్రైవర్ల అండ చూసుకుని రెచ్చిపోయాడు. నిస్సహాయుడైన ఆ ప్రయాణికుడు తెబ్బల నుంచి తప్పించుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతే కాకుండా బాధితుడి ఫిర్యాదుతో రాంనగర్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా నమోదు అయింది.

Thane: రాత్రి కాబట్టి రూ.10 ఎక్కువ అడిగితే ఇవ్వనన్నందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆటోడ్రైవర్

Passenger brutally thrashed by auto driver for refusing to pay Rs 10 extra

Thane: సాధారణంగా చీకటి పడ్డప్పుడు పగలు తీసుకునే రవాణా చార్జీలకంటే కాస్త ఎక్కువ తీసుకోవడం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. ప్రైవేటు వాహనాల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అధికారిక ఓలా, ఊబర్ వంటి సంస్థలు కూడా అర్థరాత్రి సమయంలో ఎక్కువ ట్రావెల్ చార్జీలు వసూలు చేస్తుంటాయి. కాగా, చీకట్లో ప్రయాణం చేసినందుకు గాను ఒక ప్రయాణికుడిని చార్జీ డబ్బుల కంటే ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అంతే, ప్రయాణికుడి మీద ఆటో డ్రైవర్ అనుచితంగా దాడికి దిగాడు. తన వద్ద ఉన్న బంబూ కర్రతో కొట్టాడు.

Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సర్వేలో ఆసక్తికరమైన సమాధానాలు

తన్నాడు, చెంపలపై కొట్టాడు, బూతులు తిట్టాడు. ఆటోలు ఆగిన ప్రదేశం కావడంతో ఆటో డ్రైవర్ల అండ చూసుకుని రెచ్చిపోయాడు. నిస్సహాయుడైన ఆ ప్రయాణికుడు తెబ్బల నుంచి తప్పించుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతే కాకుండా బాధితుడి ఫిర్యాదుతో రాంనగర్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా నమోదు అయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా డోంబివిల్లీలో జరిగింది. ఆటో డ్రైవర్ మీద సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ పుటేజీ పరిశీలించామని, మరిన్ని వివరాలు సేకరించామని స్థానిక పోలీసు అధికారి సచిన్ సంభోర్ తెలిపారు.

Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

బాధితుడి పేరు గణేశ్ తాంబే. డోంబివిల్లీలోని ఇందిరా చౌక్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో చార్జీ 30 రూపాయలు. అయితే ఆటో డ్రైవర్ తనను 40 రూపాయలు డిమాండ్ చేశాడట. దానికి తను ఒప్పుకోకపోవడంతో తనను కర్రతో కొట్టి బూతులు తిట్టినట్టు వెల్లడించాడు. వేరొక ఆటో డ్రైవర్ అడ్డురావడంతో ఆగాడట. తాను డయల్ 100 పోలీస్ ఎమర్జెన్సీకి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఫిర్యాదులో ఆటో రిజిస్టర్డ్ నంబర్ రాసుకొచ్చాడు.