Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్‌పై అణిచివేత కారణంగా ఉద్భవిస్తున్న పరిస్థితులపై చర్చించడానికి గత ఆదివారం సిక్కు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.

Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

Amritpal Singh Releases First Video Amid Crackdown By Police

Amritpal Singh: అరెస్ట్ వారెంట్ జారీ చేయగానే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వారిస్ పంజాబ్ దే నాయకుడు, ఖలిస్తానీ నేత అమృతపాల్ సింగ్.. మొదటిసారి ఒక వీడియోను విడుదల చేశాడు. పోలీసుల పద్మవ్యూహాన్ని తప్పించుకున్నానని, తనకు ఎవరూ ఎలాంటి హాని చేయలేదని అతడు, తనను ఎవరూ తాకలేరని ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. అంతే కాకుండా.. వచ్చే నెలలో జరిగే బైసాఖి పండుగ సందర్భంగా సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సర్బత్ ఖల్సా అనే పాంథిక్ సిక్కుల సమావేశాన్ని నిర్వహించాలని సిక్కు సంఘాలకు విజ్ఞప్తి చేశాడు.

Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

తనపై పోలీసుల చర్యలను అమృతపాల్ తప్పుపట్టాడు. ఇక పోలీసుల ముందు లొంగిపోవడానికి నిరాకరించిన అతడు, తాను అరెస్టు అవుతాననే భయం లేదని అన్నాడు. వాస్తవానికి తనను అరెస్టు చేసే ఉద్దేశ్యం పోలీసులకు లేదని అన్నాడు. అలా చేసేది ఉంటే ఇంట్లో ఉన్నప్పుడే తనను అరెస్ట్ చేసే వారని అమృతపాల్ అనడం కొసమెరుపు. మార్చి 18న పోలీసులు తనను వెంబడించడం ప్రారంభించినప్పుడు, తనను, తన మద్దతుదారులను ముక్త్‌సర్‌కు వెళ్లకుండా ఆపడమే వారి ఉద్దేశమని భావించానని అన్నాడు. ప్రజలను సమీకరించడానికి మతపరమైన ఊరేగింపు అయిన ఖల్సా వహీర్ రెండవ దశను ప్రారంభించబోతున్నారని అమృతపాల్ చెప్పాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్య, 90వ దశకం ప్రారంభంలో బియాంత్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మాదిరిగానే ఉందని, ఇందులో వందలాది మంది సిక్కులు ‘కనుమరుగై’ ఎన్‌కౌంటర్‌లలో చంపబడ్డారని అమృతపాల్ ఆరోపించాడు. వారి ఉద్దేశం హానికరమైందని తాము తొందరలోనే గ్రహించామని, గురువుల ఆశీర్వాదం వల్లే తాము పోలీసు భారీ వలయం నుంచి తప్పించుకోగలిగామని అన్నాడు. తనపై అణిచివేత ప్రారంభమైన తర్వాత అరెస్టు చేసిన సిక్కులందరినీ విడుదల చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి అకాల్ తఖ్త్ నాయకుడు “అల్టిమేటం” జారీ చేసిన ప్రకటనను కూడా అమృతపాల్ ప్రస్తావించాడు.

Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సర్వేలో ఆసక్తికరమైన సమాధానాలు

‘‘దేశ విదేశాల్లో సిక్కు సమాజం ఎక్కడ ఉన్నా, బైశాఖీ నాడు జరిగే ఈ సర్బత్ ఖాల్సాలో అందరూ పాల్గొనాలి. అక్కడి నుంచి సమాజ సమస్యలపై చర్చ జరగాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన జఠేదార్ సాహిబ్ చెప్పినట్లుగా మతపరమైన కీర్తనలు నిర్వహిస్తూ గ్రామాలకు, ప్రజలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన సమాజం మీద చాలా కాలంగా చిన్న చూపు ఉంది. మన సమస్యల్ని పట్టించుకోవడం లేదు. మన సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మా ఉద్యమకారులపై జాతీయ భద్రతా చట్టం విధించి హింసిస్తున్నారు. వారు చేసిన తప్పు, సిక్కు మతం గురించి మాట్లాడటం’’ అని వీడియోలో అమృతపాల్ అన్నాడు.

Viral Video: ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా.. ఇది కదా గల్లీ క్రికెట్ అంటే.. హిలేరియస్ వీడియో!

ఇంకా అతడు మాట్లాడుతూ ‘‘నా సహచరుల్లో చాలా మందిని అస్సాం పంపారు. మరికొందరిని జైల్లో పెట్టారు. ఇది మాపై నేరుగా జరుగుతోన్న అణచివేత. మనం నడిచే బాటలో వీటన్నిటినీ భరించాల్సి ఉంటుంది. ఇది మన జాతీయ కర్తవ్యమని మాకు తెలుసు. ప్రజలలో ప్రభుత్వం సృష్టించిన భయాందోళనలను తొలగించడానికి, పార్టీ అయినా, మింట్ అయినా, సిక్కు సంస్థ అయినా, అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈసారి నిర్వహించే సర్బత్ ఖల్సా అందుకు పెద్ద వేదిక కావాలి. పంజాబ్ యువత రక్షించబడాలంటే, మన జాతీయ హక్కులు సాధించబడాలంటే, మనం ఐక్యంగా ఉండాలని నేను నా సంగత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అమృతపాల్ అన్నాడు.

PM Modi: ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. అది దేశ ఆత్మ.. సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో పీఎం మోదీ

ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్‌పై అణిచివేత కారణంగా ఉద్భవిస్తున్న పరిస్థితులపై చర్చించడానికి గత ఆదివారం సిక్కు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.