PM Modi: ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. అది దేశ ఆత్మ.. సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో పీఎం మోదీ

అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే 'సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం' అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

PM Modi: ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. అది దేశ ఆత్మ.. సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో పీఎం మోదీ

Democracy is not just a structure. It is also spirit says PM Modi

PM Modi: ప్రజాస్వామ్యం అనేది కేవలం నిర్మాణం మాత్రమే కాదని, అది దేశ ఆత్మ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది ప్రతి మనిషి అవసరాలకు, ఆకాంక్షలకు సమానంగా పని చేస్తుందని, ప్రతి మనిషి నమ్మకంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అంటే ‘సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం’ అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

ఈ సమ్మిటల్‭లో ప్రజాస్వామ్యం, భారతదేశం గురించి మోదీ చెప్పిన కొన్ని ముఖ్య అంశాలు..
1. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందే భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి అమలులో ఉంది. దేశంలో ఎన్నిక కావాల్సిన నాయకులకు సాధారణ లక్షణాలు ఉంటాయి.
2. ప్రజాస్వామ్య సద్గుణాల గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశానికి ఉన్న విశేష గుణాల వల్ల నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీనిని నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఇదే అత్యుత్తమ ప్రకటన. ఇది, అత్యుత్తమ ప్రజాస్వామ్యం అందించగలదు.
3. ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. ఇది ఆత్మ కూడా. ఇది ప్రతి మనిషి అవసరాలకు, ఆకాంక్షలకు సమానంగా పని చేస్తుంది.
4. వాతావరణ మార్పులపై పోరాడాలన్నా, నీటిని సంరక్షించాలన్నా లేదా ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించాలన్నా, ప్రతి ప్రయత్నం భారత పౌరుల సమిష్టి కృషితో సాగుతుంది.
5. మా వ్యాక్సిన్ మైత్రి చొరవ మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ఇది కూడా ‘వసుధైవ కుటుంబం’ అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఆత్మలచే మార్గనిర్దేశం చేయబడింది.
6. భారతదేశంలో మా మార్గదర్శక తత్వశాస్త్రం ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్’, ఇది ‘సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం’!