Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5,21, 73,579 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది

Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah says 2023 will be his last election

Karnataka polls: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య భారీ ప్రకటన చేశారు. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పొటీ చేయనున్న ఆయన.. ఇక ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. ఈ ఎన్నికల అనంతరం రాజకీయంగా తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ఎన్నికల రాజకీయాల గురించి స్పష్టత వచ్చినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది, లేదంటే దాన్ని కూడా తప్పుకుంటారా లేదా అనేది స్పష్టత లేదు.

Karnataka: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి వింత చర్య.. ఎన్నికల ర్యాలీలో రూ.500 నోట్లు వెదజల్లిన వైనం

ఇక తన కుమారుడి స్థానమైన వరుణ నుంచి పోటీకి సిద్ధమైన ఆయన.. కోలాన్ నియోజకవర్గం నుంచి కూడా పోటీకి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ స్థానం నుంచే పోటీ చేయాలని ఆయన మొదట అనుకున్నప్పటికీ.. హైకమాండ్ నిర్వహించిన సర్వేలో ఆయన గెలుపు కష్టమని తేలింది. ఇక హైకమాండ్ సూచనతో ఆ స్థానం నుంచి పోటీ నుంచి తప్పుకుని కేవలం వరుణ నుంచే పోటీ చేయనున్నట్లు వనిపించింది. అయితే కేంద్రం సూచన మేరకు వరుణ నుంచి పోటీ చేయడమే కాకుండా, కోలార్ నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కోలార్ ప్రజలు తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకే రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు.

Wayanad Bypoll: ఆ గడువు పూర్తయ్యాక మేం స్పందిస్తాం.. రాహుల్ నియోజకవర్గంలో ఉపఎన్నికపై సీఈసీ స్పందన

ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5,21, 73,579 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో కొత్తగా 9.17లక్షల మంది ఓటర్లు చేరారు. 100 ఏళ్లుపైబడిన ఓటర్లు 16వేలకుపైగా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల సంఘం 80ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్నికల్పించింది.