Wayanad Bypoll: ఆ గడువు పూర్తయ్యాక మేం స్పందిస్తాం.. రాహుల్ నియోజకవర్గంలో ఉపఎన్నికపై సీఈసీ స్పందన

వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప‌ఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

Wayanad Bypoll: ఆ గడువు పూర్తయ్యాక మేం స్పందిస్తాం.. రాహుల్ నియోజకవర్గంలో ఉపఎన్నికపై సీఈసీ స్పందన

Rahul Gandhi

Wayanad Bypoll : మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసు (Defamation case) లో కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సూరత్ కోర్టు (Surat Court) రెండేళ్లు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు తరువాత ఒక్కరోజులోనే లోక్‌సభ సచివాలయం (Lok Sabha Secretariat) రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. ఇదేసమయంలో.. కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commissioner) తేదీని ప్రకటించింది. ఆ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తోంది. మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. కర్ణాటక (Karnataka)  ఎన్నికల తేదీ ప్రకటించే సమయంలోనే కేరళలోని వయనాడ్ లోక్‌సభ (Wayanad Lok Sabha)  స్థానంకు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడుతుందన్న ప్రచారం జరిగింది. అయితే, సీఈసీ మాత్రం కేవలం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది.

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు

రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ఉపఎన్నిక తేదీ ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా.. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప‌ఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajeev Kumar) సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయం విధితమే. ఇదే విషయాన్ని రాజీవ్ కుమార్ ప్రస్తావించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకు వేచి చూస్తామని, గడువు పూర్తయిన తరువాత మేం స్పందిస్తామని ఆయన వెల్లడించారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించామని చెప్పారు. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అయితే, మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే ఎన్నిక నిర్వహించాల్సిన పనిలేదని రాజీవ్ కుమార్ చెప్పారు.