Ram Charan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్లైపోద్ది’.. రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ లాస్ట్ వీకెండ్ సోషల్ మీడియాలో సందడి చేశాడు. మార్చి 27 చెర్రీ బర్త్‌డే సందర్భంగా 26 నుండి రెండు రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ అప్ డేట్స్, ఫ్యాన్స్ మీట్‌తో నెట్టింట రామ్ చరణ్ పుట్టినరోజు ట్రెండింగ్‌లో నిలిచింది.

Unknow Facts About Ram Charan Watch And T Shirt

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ లాస్ట్ వీకెండ్ సోషల్ మీడియాలో సందడి చేశాడు. మార్చి 27 చెర్రీ బర్త్‌డే సందర్భంగా 26 నుండి రెండు రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ అప్ డేట్స్, ఫ్యాన్స్ మీట్‌తో నెట్టింట రామ్ చరణ్ పుట్టినరోజు ట్రెండింగ్‌లో నిలిచింది. లేటెస్ట్‌గా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి ఫ్యాన్స్ అండ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. రెండు వేరు వేరు సందర్భాల్లో చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను జూమ్ చేసిన ఫ్యాన్స్ వాటి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు.

Ram Charan Birthday : రామ్ చరణ్‌ను సర్‌ప్రైజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. తారక్ మొదలు న్యూయార్క్ వరకు విషెస్ వెల్లువ..

చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లొకేషన్‌లో సర్‌ప్రైజ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు చరణ్ కలర్ పెయింటింగ్‌తో కూడిన పాపులర్ ఫ్యాషన్ DIOR బ్రాండ్ టీషర్ట్ వేసుకున్నాడు. దీని ఖరీదు అక్షరాలా రూ.76,069 అన్నమాట.

ఇక మరో చోట బ్యూటిఫుల్ వాచ్‌తో కనిపించాడు చరణ్. అది మోస్ట్ పాపులర్ Richard Mille RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. చరణ్ పెట్టుకున్న ఆ వాచ్ ఖరీదు ఎంతయ్యా అంటే అక్షరాలా 1కోటి 9లక్షల 18 వేల 566 రూపాయలు.. వాచ్ రేట్ విన్న ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతూ.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత చెప్పిన ‘వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెట్లైపోద్ది’ అనే డైలాగ్ గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.