Unknown Facts About Actress Revathy Sampath
Revathy Sampath: హాలీవుడ్‌లో స్టార్ట్ అయిన మీటు మూమెంట్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్కరు ధైర్యంగా ముందడుగేస్తే.. మరికొందరు హీరోయిన్లు, సింగర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బాహాటంగా తమను వేధింపులకు గురిచేసిన వారి గుట్టు బట్టబయలు చేశారు.
రీసెంట్‌గా మలయాళీ నటి రేవతి సంపత్ తనను చెప్పుకోలేని విధంగా హింసించారంటూ.. ఏకంగా 14 మంది పేర్లు బయటపెట్టడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో పాటు ఓ డాక్టర్, సబ్‌ఇన్స్‌పెక్టర్, ఒక డీవైఎఫ్ఏ నేత పేర్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె గురించి తెలియని వాళ్లు అసలు ఎవరీ రేవతి సంపత్.. ఎక్కడినుండ వచ్చింది.. ఏం సినిమాలు చేసింది..? అంటూ ఆరాలు తీస్తున్నారు.
Revathy Sampath : దక్షిణాది సినీ ప్రముఖులపై నటి రేవతి సంపత్ షాకింగ్ కామెంట్స్..
సంపత్ కుమార్, ప్రియా సంపత్.. రేవతి పేరెంట్స్.. 27 ఏళ్ల రేవతి సంపత్.. సోషల్ యాక్టివిస్ట్, సైకాలజిస్ట్.. కోయంబత్తూర్‌లోని ఓ పాపులర్ కాలేజ్ నుండి సైకాలజీలో డిగ్రీ పొందింది. 2018లో ‘వఫ్త్’ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసింది. 2019లో Patnagarh అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఒడియాతో పాటు, తెలుగులో ‘పట్నఘడ్’ పేరుతో రిలీజ్ అయింది.
ఈ మూవీని నేషనల్ అవార్డ్ విన్నర్ రాజేష్ టచ్ రివర్ డైరెక్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఓ పాపులర్ ఆర్టిస్ట్ మీద కూడా ఈమె ఆరోపణలు చేసింది. సినిమాల్లో మైలేజ్ కోసం, ఫేమ్ కోసమే తను సినీ ప్రముఖుల మీద కామెంట్స్ చేస్తుంది అనే వాళ్లూ లేకపోలేదు. నటిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టకుండా ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటే అవకాశాలెవరిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దక్షిణాది సినీ ప్రముఖులపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో రేవతి సంపత్ పేరు మారుమోగిపోతోంది..
Rajesh Touchriver : రేవతి ఆరోపణలు అవాస్తవం.. డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్..