Unknown Facts About Samantha Akkineni Nickname
Samantha: ‘ఏమాయ చేసావె’ మూవీతో నిజంగా తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేశారు సమంత రూత్ ప్రభు అలియాస్ సమంత అక్కినేని.. తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాలు చేసి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యనను వివాహం చేసుకున్న తర్వాత కెరీర్ మరింత ఊపందుకుంది.. లేడి ఓరియంటెడ్ మూవీస్‌తో మంచి నటిగా ప్రూవ్ చేసుకుని తన స్టార్ డమ్ మరింత పెంచుకున్నారు.. ఏప్రిల్ 28 సామ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సీనీ ప్రముఖులు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు..
రీసెంట్‌గా సమంతను గురించి ఓ వార్త.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. సమంతను ఆమె ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ యశోద అని పిలుస్తారట.. ఈ విషయం చాలా మందికి తెలియదు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన సమంత..
తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయమందిస్తున్నారు.. అలాగే ఏకం అనే Learning School స్థాపించి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే హిస్టారికల్ మూవీలో టైటిల్ రోల్ చేస్తున్నారు..