UP minister Rakesh Sachan found guilty in Arms Act
UP: 1991 నాటి అక్రమ ఆయుధాల కేసులో ఉత్తర ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్ దోషని కాన్పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో తీవ్ర అసహనానికి గురైన ఆయన.. వెంటనే కోట్లు మెట్లు దిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వెంటే ఆయన మద్దతుదారులు, లాయర్లు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే మంత్రి ఈ ఆరోపణలు ఖండించారు. తనపై ఇంకొన్న కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా అన్నాయని అన్నారు. అయితే ప్రస్తుత తీర్పుపై ఆయనను ప్రశ్నించగా కోర్టు తీర్పును గౌరవిస్తానని రాకేశ్ పేర్కొన్నారు.
రాకేశ్ సచాన్ గతంలో సమాజ్‌వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్‌పాల్ యాదవ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికమ ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి యోగి కేబినెట్ టెక్స్టైల్, ఎంఎస్ఎంఈ మంత్రిగా పదవి పొందారు. తాజా తీర్పులో రాకేశ్‌పై కత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయమై తనకు ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కాన్పూర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ తెలిపారు.
Israel Palastine war: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 28 మంది మృతి.. వందలాది మందికి గాయాలు