viral video: వరుణుడు కరుణించాలని బురదతో ఎమ్మెల్యే స్నానం.. వీడియో వైర‌ల్

బుర‌ద‌లో ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా హాయిగా స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. బుర‌ద‌తో న‌గ‌ర పెద్ద‌కు స్నానం చేయించామ‌ని, ఇక వ‌ర్షాల రావ‌ని తాము దిగులు చెందే అవ‌స‌ర‌మే లేద‌ని ఓ మ‌హిళ తెలిపింది.

Mla

viral video: వ‌రుణుడు క‌రుణించాల‌ని, నీటి కొర‌త లేకుండా పంట‌లు బాగా పండాల‌ని సాధారణంగా య‌జ్ఞ, యాగాలు చేస్తుంటారు. అయితే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హారాజ్ గంజ్ జిల్లాలో మాత్రం న‌గ‌ర పెద్ద‌కు బుర‌ద‌తో స్నానం చేయిస్తారు. చాలా కాలంగా ఇక్క‌డ ఈ ఆచారం కొన‌సాగుతోంది. ఇలాచేస్తే ఇంద్రుడు త‌మ భ‌క్తికి మెచ్చి వ‌ర్షాభావం లేకుండా దీవిస్తార‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత జైమంగల్ కనోజియాతో పాటు న‌గ‌ర పాలక ఛైర్మ‌న్ కృష్ణ గోపాల్ జైశ్వాల్‌ను పిపార్డ్యూర్‌కు పిలిపించిన మ‌హిళ‌లు వారిద్ద‌రికీ బుర‌ద‌తో స్నానం చేయించారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

మ‌గ్గులు, బ‌కెట్ల‌లో బురద తీసుకొచ్చి వారిద్ద‌రిపై వేశారు. బుర‌ద‌లో ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా హాయిగా స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. బుర‌ద‌తో న‌గ‌ర పెద్ద‌కు స్నానం చేయించామ‌ని, ఇక వ‌ర్షాల రావ‌ని తాము దిగులు చెందే అవ‌స‌ర‌మే లేద‌ని ఓ మ‌హిళ తెలిపింది. వ‌ర్షాలు బాగా ప‌డితే పంట‌లు బాగా పండుతాయ‌ని చెప్పింది. ఇంద్రుడి ద‌య త‌మ‌పై ప‌డ‌డానికి చిన్నారులు కూడా బుర‌ద‌లో స్నానం చేసే ఆచారం ఉంద‌ని ఆమె తెలిపింది. వ‌ర్షాల కోసం త‌న‌కు మ‌హిళ‌లు బుర‌త‌తో స్నానం చేయించార‌ని ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా తెలిపారు.