Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

అఫ్గానిస్థాన్‌లో బాలిక‌లు మాధ్యమిక విద్యను అభ్య‌సించ‌కుండా తాలిబ‌న్ ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డంతో అమ్మాయిల భ‌విష్య‌త్తు అంధ‌కారంలోకి వెళ్ళే ప్ర‌మాదం ఉంద‌ని న్యూయార్క్ వేదిక‌గా ప‌నిచేసే మాన‌వ హ‌క్కుల సంఘం 'హెచ్ఆర్‌డ‌బ్ల్యూ' పేర్కొంది.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

Afghan Girls

Afghan girls: అఫ్గానిస్థాన్‌లో బాలిక‌లు మాధ్యమిక విద్యను అభ్య‌సించ‌కుండా తాలిబ‌న్ ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డంతో అమ్మాయిల భ‌విష్య‌త్తు అంధ‌కారంలోకి వెళ్ళే ప్ర‌మాదం ఉంద‌ని న్యూయార్క్ వేదిక‌గా ప‌నిచేసే మాన‌వ హ‌క్కుల సంఘం ‘హెచ్ఆర్‌డ‌బ్ల్యూ’ పేర్కొంది. ఇప్ప‌టికే 300 రోజుల పాటు అఫ్గాన్ బాలిక‌లు మాధ్య‌మిక విద్య‌కు దూర‌మ‌య్యారు. బాలిక‌లు మాధ్య‌మిక విద్యకు దూరం కావ‌డంతో భ‌విష్య‌త్తులో వారు, వారి తల్లిదండ్రులు, దేశం తీవ్ర ప్ర‌తికూల ప‌రిణామాలు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్ఆర్‌డ‌బ్ల్యూ తెలిపింది. అఫ్గాన్‌లో అనేక స‌మ‌స్య‌ను ఎదుర్కొని కెరీర్‌లో రాణిస్తోన్న‌ సినీ, ప‌రిశోధ‌న‌తో పాటు జ‌ర్న‌లిజం రంగాల‌కు చెందిన‌ ఆరుగురు మ‌హిళ‌లను హెచ్ఆర్‌డ‌బ్ల్యూ ఇంట‌ర్వ్యూ చేసింది.

Delhi HC : భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న మహిళలు..గృహహింస చట్టం దుర్వినియోగమవుతోందంటూ హైకోర్టు సీరియస్

ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆ ఆరుగురిని హెచ్ఆర్‌డ‌బ్ల్యూ శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌లుగా పేర్కొంది. అఫ్గాన్‌లో మ‌హిళల ప‌రిస్థితి ఎలా ఉందో వారు చెప్పిన వివ‌రాల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని తెలిపింది. వారి ఆందోళ‌న గురించి ప్ర‌పంచం తెలుసుకోవాల‌ని చెప్పింది. ఆ బాలిక‌లు ఎదుర్కొంటున్న‌ దుస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు కృషి చేయాల‌ని కోరింది. ల‌క్ష‌లాది మంది అఫ్గాన్ బాలిక‌లు త‌మకున్న అవ‌కాశాల‌ను కోల్పోతున్నార‌ని, వారి క‌ల‌ల‌ను నిజం చేసుకోలేక‌పోతున్నార‌ని పేర్కొంది.

Sri Lankan Economic Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతల స్వీకరణ!

బాలిక‌లు చ‌దువుకోవ‌చ్చా? అనే విష‌యంపై కూడా సంభాషించే అవ‌కాశం ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఓ మ‌హిళ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 2021, ఆగ‌స్టు నుంచి అఫ్గాన్‌ను త‌మ అధీనంలోకి తీసుకున్న తాలిబ‌న్లు బాలిక‌లు, మ‌హిళ‌ల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను భంగం క‌లిగించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. బాలిక‌ల‌ను మాధ్య‌మిక విద్యకు దూరం చేయ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో మ‌హిళ‌ల నాయ‌క‌త్వం లేకుండా చేశారు. అంతేగాక‌, పురుషుడి తోడు లేకుండా మ‌హిళ‌లు ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని తాలిబ‌న్లు ఆంక్ష‌లు విధించార‌ని హెచ్ఆర్‌డ‌బ్ల్యూ గుర్తు చేసింది.