Delhi HC : భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న మహిళలు..గృహహింస చట్టం దుర్వినియోగమవుతోందంటూ హైకోర్టు సీరియస్
గృహ హింస చట్టం దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Delhi High Court Serious Domestic Violence Act
Delhi High Court serious Domestic Violence Act : భారత్ లో గృహ హింస చట్టం దుర్వినియోగమవుతోంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది సరైన వాదన కాదు అనేది మహిళా సంఘాలు వాదన. గృహిణులకు భద్రతను కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిన ఈ చట్టం ఆసరాతో కొంతమంది మహిళలు తప్పుడు కేసులు పెడుతున్నారని కొంతమంది ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈక్రమంలో ఓ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు గృహ హింస చట్టం దుర్వినియోగంపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ చట్టంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భర్తలపై గృహ హింస చట్టం కేసులు పెట్టే కొంతమంది మహిళలు మొత్తం కుటుంబసభ్యులపై పెట్టే కేసుల సంఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. తప్పుడు కేసులతో ఈ చట్టం దుర్వినియోగమవుతోందని… ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉందని..దీన్ని ఇలాగే వదిలేస్తే… చట్టం మరింత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని మంగళవారం (12,2022) ఒక మహిళ కేసును విచారిస్తున్న సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్, జస్టిస్ అనూప్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Also read : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!
ఒక మహిళ తన భర్త కుటుంబం నుంచి డబ్బులు లాగేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య ప్లాన్ వేసింది. ఆమె కనిపించకుండా దాక్కుంది.దానికి ఆమె పుట్టింటివారు కూడా సహకరించారు. ఈక్రమంలో తమ కూతురు కనిపించట్లేదని..కూతురు భర్త, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో సదరు భర్త (అల్లుడు) కుటుంబం నుంచి డబ్బులు లాగేందుకు యత్నించారు.
ఈ క్రమంలో తాము తప్పు చేయలేదని బాధితుడు..అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబసభ్యులు నాటకమాడినట్టు కోర్టు గుర్తించింది. ఈ నేరానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల భర్త, ఆయన కుటుంబ సభ్యులు సమాజంలో పరువు కోల్పోతారని, తీవ్ర వేదనను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.
ఈ కేసు వల్ల సదరు భర్త 30 నుంచి 40 సార్లు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.దీంతో అతని కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురి అయ్యింది. ఈ కేసు విషయంలో ఏ సమయంలో తనను..తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారోనని అతను వేదనకు గురి అయ్యేవాడు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను మీడియా పదే పదే చూపిస్తుండటంతో బాధిత కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురి అయ్యింది. ఇటువంటి పరిస్థితి తప్పుడు కేసులు పెట్టే మహిళల వల్ల వస్తోంది అని..చట్టాన్ని కవచంగా వాడుకుంటున్న కొంతమంది మహిళల వల్ల గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోంది అంటూ జస్టిస్ అనూప్ కుమార్ అన్నారు.
ఇలాంటి అవాస్తవాల వల్ల సామాజిక నిర్మాణం నాశనం కాకుండా చూసేందుకు ఇటువంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అన్నారు. వైవాహిక వివాదాలు..విభేదాల సమయంలో మొత్తం కుటుంబంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.తప్పుడు కేసుల వల్లచట్ట ప్రక్రియను మరింత దుర్వినియోగం చేయడానికి..తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు అని అన్నారు.