Skin to Skin contact :స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ కేసు..దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే : స్పష్టం చేసిన సుప్రీం

స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్స్ లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచనల వ్యాఖ్యలు చేసింది. బాంబే కోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Skin to Skin contact :స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ కేసు..దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే : స్పష్టం చేసిన సుప్రీం

Skin To Skin Contact Case

Skin to Skin contact case  : స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ లైంగిక వేధింపుల కేసు విషయంలో బాధిత బాలిక శరీరాన్ని తాకకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తే.. పోక్సో(POCSO) చట్టం ప్రకారం వేధింపుల కిందకు రాదని జనవరి-19న బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనం అయని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పు చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా ఉందని
వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల అనేవి చాలా దారుణమైన విషయం అనీ..వేధింపులకు గురి చేసేవారు. ఎక్కడ ఎలా తాకాడు? అనేది ముఖ్యంగా కాదు వేధింపులు అనేదే నేరం..దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

‘ఇటువంటి కేసుల్లో తీర్పునిచ్చే విషయంలో న్యాయమూర్తులు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. బాధితురాలు..ఆమె కుటుంబ సభ్యుల మనోవేదనను ధర్మాసనం అర్థం చేసుకోవాలి.తెలిసీ తెలియని వయస్సులో..లోకం అంటే ఏంటో కూడా తెలియని పసిప్రాయంలో జరిగిన లైంగిక వేధింపులు బాలికల మనస్సులో చెరగని ముద్రవేస్తాయి. అవి వారి జీవితంపై ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని ధర్మాసనాలు దృష్టిలో పెట్టుకోవాలి.అనే ఆలోచించకుండా ఏదో సాధారణ విషయంలాగా ‘స్కిన్‌ టూ స్కిన్‌ కాంటాక్ట్‌ లేకుంటే పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేం’ అని చెప్పటం అత్యంత దారుణం. ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు ఇటువంటి తీర్పులిచ్చినవారికి చెంపపెట్టు అనుకోవాలి.

Read more : స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

సుప్రీంకోర్టు చేసిన పనలు కీలక వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..‘చట్టాలు స్పష్టమైన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. న్యాయస్థానాలు ఆ నిబంధనల్లో గందరగోళం సృష్టించకూడదు. న్యాయస్థానాలు అత్యుత్సాహం చూపడం సరికాదని సూచించింది. ఇక్కడ పోక్సో చట్టం లక్ష్యం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం. అంతేకానీ వారిని మరింతగా వేదనకు గురి చేయటనాకి కాదు. బాధితురాలి కుటుంబ సభ్యుల వేదన తీర్చేదిగా ఉండాలి. మరింత వేదన కలిగించేలా ఉండకూడదు.

లైంగిక దాడి చేయాలనే ఉద్దేశంతో బాలికను తాకినప్పుడు అది నేరం కిందే లెక్క…అంతేగానీ..నేరాన్ని పరిగణించేటప్పుడు.. నిందితుడు శరీరాన్ని నేరుగా స్పృశించాడా (టచ్ చేశాడా? లేదా..దుస్తుల పై నుంచి తాకాడా? అనేది అనవసరం..’’ అని జస్టిస్‌ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ కేసు వివరాలు..
2016లో సతీష్‌ అనే వ్యక్తి ఓ బాలికకు చాక్లెట్ ఆశ చూపించి..తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకాడు. అసభ్యంగా తడిమాడు. ఆ తరువాత బాలికపై అత్యాచారం చేసే యోచనలో ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. దీంతో పాపం ఆ బాలికకు ఏదో భయం వేసింది. అతను తన శరీరాన్ని తాకటం ఆ అమాయకపు బాలికకు నచ్చలేదు. అతని ఆలోచన అర్థం చేసుకునేంత వయస్సులో పరిపక్వత లేకపోయినా ఏదో భయంతో పెద్ద పెద్దగా కేకలు వేసింది.దాంతో కూతురు కేకలు వేసే తీరులో ఏదో అపశృతి వినిపించిదా తల్లికి.అంతే ఒక ఉదుటన కూతురు కేకలు వేసిన చోటికి చేరుకుంది.తల్లిని చూసి పరుగు పరుగున వచ్చిన బాలిక భయంతో వణికిపోతు వచ్చి తల్లిని వాటేసుకుంది. అతని వంక భయం భయంగా చూస్తు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లికి విషయం అర్థమైంది. అతనిపై పిచ్చి కోపమొచ్చింది. కూతురురిని పొదివి పట్టుకుని గుండెలకు హత్తుకుని పోలీసుల్ని..న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని సెషన్స్‌ కోర్టుకు అప్పగించింది. దీంతో సెషన్స్ కోర్టు నిందితున్ని పోక్సో చట్టం కింద దోషిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుని నిందుతుడు సవాలు చేస్తు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈకేసును స్వీకరించి విచారణ చేపట్టిన నాగ్‌పుర్‌ బెంచ్‌ సంచలన తీర్పును వెలువరించింది.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

ఓ బాలిక శరీరాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్)నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం నిందితుడిని నిర్దోషిగా
ప్రకటించారు.

ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై నిరసనలు వ్యక్తంచేశారు. తీర్పుని నిలిపివేయాలని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ తీర్పుని అటార్నీ జనరల్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా తప్పుపట్టింది.అనంరతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసింది. తాజాగా ఆ తీర్పు కొట్టివేస్తున్నట్లు వెల్లడిస్తు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.