Sri Lankan Economic Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతల స్వీకరణ!

శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గొటబాయ దేశం విడిచిన కొద్ది గంటల్లోనే.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్ర‌మసింఘే బాధ్యతలు చేపట్టారు.

Sri Lankan Economic Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతల స్వీకరణ!

Sri Lanka

Sri Lankan Economic Crisis: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గోటబాయ రాజపక్సేకు దేశంలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన విషయం విధితమే. బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక విమానం ద్వారా గొటబాయ సతీమణితో కలిసి మల్దీవులకు వెళ్లిపోయాడు. గొటబాయ దేశం విడిచిన కొద్ది గంటల్లోనే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మసింఘే బాధ్యతలు చేపట్టారు. బుధవారం గొటబాయ రాజపక్సే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ రాజీనామా ప్రకటన చేయకుండా మల్దీవులకు పారిపోవటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మ‌రోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధ‌న కింద ర‌ణిల్ విక్ర‌మసింఘేను తాత్కాలిక అధ్య‌క్షుడిగా నియ‌మించామ‌ని స్పీక‌ర్ వెల్ల‌డించారు.

తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ సింఘే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇప్పటికే ప్రధాని పదవికి విక్రమసింఘే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. బుధవారం ఉదయం ప్రధాని ఇంట్లోకి ఆందోళన కారులు దూసుకెళ్లారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దేశంలో మరోసారి పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

Emergency In Sri Lanka: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం..!

రాజపక్సేలకు వ్యతిరేకంగా నిరసనలు నెలల తరబడి కొనసాగాయి. గత వారం వేలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనం, ప్రధాని నివాసాన్ని ముట్టడించడంతో ఆందోళన తీవ్రమైంది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే కుటుంబమే కారణమని, దీంతో పౌరులు ఇంధనం, ఆహారం, మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కొలంబోతో సహా పశ్చిమ ప్రావిన్స్ అంతటా పోలీసులు నిరవధిక కర్ఫ్యూ విధించడం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరితే రాజీనామాకు సిద్ధమని విక్రమసింఘే ఇప్పటికే ప్రకటించారు.