Emergency In Sri Lanka: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం..!

శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనల జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అధ్యక్షుడు గోటబయ పారిపోయిన అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. వెంటనే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Emergency In Sri Lanka: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం..!

Emergency In Sri Lanka Once Again (1)

Emergency in Sri Lanka: శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ శ్రీలంకలో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. అధ్యక్షుడు గోటబయ పారిపోయిన అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. వెంటనే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కసారిగా రోడ్లపై వచ్చిన వేలాది మంది ప్రజలు రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నిరసనకారులను అదుపు చేసేందుకు సైనిక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొలంబోలోని శ్రీలంక ప్రధాని నివాసంలోకి వెళ్లేందుకు గోడను ఎక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనిక సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పేలా కనిపిస్తున్నాయి. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని లంకేయులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా..శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా ఏమాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకు పరిస్థితులు తీవ్రతరమవతున్నాయి. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. బుధవారం (7,2022) తెల్లవారుజామున గొటబచ భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయారు.

అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే.. పదవి నుంచి వైదొలగుతానని గొటబాయ సోమవారం షరతులు పెట్టారు. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో అధ్యక్ష పదవి నుంచి జులై 13న వైదొలగుతానని గొటబాయ ఇదివరకే పార్లమెంటు స్పీకర్‌కు, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు తెలిపారు. కానీ అన్నట్లుగా ఏమీ చేయకుండానే రాజపక్స రాజీనామా లేఖను సమర్పించకుండా వెళ్లడం.. దేశంలో కలకలం రేపింది. గోటబయ దేశం విడిచిపెట్టి వెళ్లడంపై ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. శ్రీలంకలో హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. అధ్యక్షుడి బంగ్లాలో నిరసన తెలుపుతున్న ప్రజలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. బంగ్లాను విడిచి వెళ్లాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు అక్కడినుంచి కదలడం లేదు. దీంతోపాటు ప్రధాని, పార్లమెంటు తదితర ప్రాంతాల్లో కూడా నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ పోలీసులపై తిరగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో ప్రభుత్వం ఎమర్జన్సీ విధించింది.

అయితే.. రాజపక్స రాజీనామా అంశాన్ని స్పీకర్‌ ప్రకటిస్తే.. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలైన ఎస్‌జేబీ, SLF నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరమతున్నాయి.

శ్రీలంక(Sri Lanka) రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా పార్లమెంటు సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.