ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేస్తాం: ట్రంప్

  • Publish Date - May 16, 2020 / 04:36 AM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఓ ట్వీట్ చేశారు. COVID-19తో పోరాడేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలోనే ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ‘మేమెప్పుడూ ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోడీకు మహమ్మారి సమయంలో అండగానే ఉంటాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. దాంతో పాటుగా ‘వ్యాక్సిన్ తయారుచేయడంలో ఇండియాతో పాటు కలిసి పనిచేస్తున్నాం. కనిపించని శత్రువుని ఎదురించి తీరతాం’ అని ట్వీట్ చేశారు. 

మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సంవత్సరం చివరి నాటికి COVID-19వ్యాక్సిన్ సంవత్సరం చివరి నాటికి సిద్ధమవుతోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. “Operation Warp Speed” అనే ప్రాజెక్టు మొదలుపెట్టి దానికి మాజీ ఫార్మాసూటికల్ ఎగ్జిక్యూటివ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

కొద్ది రోజుల క్రితమే ఇండియా నుంచి తిరిగొచ్చాం. ఇండియాతో కలిసే పని చేస్తున్నాం. అమెరికాలో చాలా మంది ఇండియన్లు ఉన్నారు. వారిలో చాలా మంది వ్యాక్సిన్ తయారీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇండియా చాలా గ్రేట్. భారత ప్రధాని మోడీ నాకు మంచి ఫ్రెండ్. భారత్ నుంచి 29మిలియన్ డోసుల యాంటీ మలేరియా డ్రగ్.. హైడ్రాక్సిక్లోరోక్విన్ ను పంపడం చాలా ఉపయోగపడింది. దానికి మా థ్యాంక్స్ కూడా తెలియజేశాం అన్నారు. 

శుక్రవారంతో భారత కరోనా కేసులు చైనాకు సమానమయ్యాయి. 85వేల 215కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారంలో వెల్లడించింది. కరోనా వైరస్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా 44లక్షల మంది కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యారు. ఇందులో 3లక్షల మంది చనిపోయారు. 2లక్షలకు పైగా పాజిటివ్ కేసులతో రష్యా, యూకే, స్పెయిన్‌లు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Read Here>> చైనాతో అమెరికా సంబంధాలు కట్…జిన్ పింగ్ తో మాట్లాడనన్న ట్రంప్