Using TWS or Bluetooth devices_ Here's how you can safeguard yourself from Bluetooth hacking
Bluetooth Devices Hack : టెక్నాలజీ రోజురోజుకీ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. మార్కెట్లోకి అత్యాధునిక గాడ్జెట్లు వచ్చేస్తున్నాయి. అందులోనూ వైర్‌లెస్ కనెక్టివిటీ డివైజ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లలో సరికొత్త వెర్షన్లతో కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుత టెక్నాలజీతో వైర్డు కనెక్టివిటీపై ఆధారపడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కనెక్షన్‌ల కోసం చాలా డివైజ్‌లు ఇప్పుడు బ్లూటూత్ వైర్‌లెస్ కనెక్టివిటీపై ఎక్కువగా ఆధారపడతాయి. ఎక్కడికి వెళ్లినా వెంట వైర్ డివైజ్‌లను మోసుకెళ్లే ఇబ్బంది లేకుండా వైర్‌లెస్ కనెక్షన్ కలిగిన గాడ్జెట్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అందుకే బ్లూటూత్ కనెక్షన్- బ్లూబగ్గింగ్ వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి బ్లూటూత్ డివైజ్‌లే సైబర్ నేరగాళ్లకు చిక్కేలా చేస్తున్నాయి. బ్లూటూత్ హ్యాకింగ్ (Bluetooth Hacking) లేదా బ్లూబగ్గింగ్ (BlueBugging) లేదా బ్లూజాకింగ్ (BlueJacking) అనేది హ్యాకర్లు బ్లూటూత్ కనెక్షన్ ఉన్న డివైజ్‌లకు యాక్సెస్ పొందే హ్యాకింగ్ ప్రక్రియ అని చెప్పవచ్చు. హ్యాకర్లు బాధితుల ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వారి డివైజ్ యాక్సస్ చేసే వీలుంది. యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తస్కరించే అవకాశం ఉంటుంది. యూజర్లకు తెలియకుండానే డివైజ్‌పై హ్యాకర్లు పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారనేది గమనించాలి.
బ్లూబగ్గింగ్ ఎలా పనిచేస్తుందంటే? :
బ్లూటూత్ యూజర్లను కనుగొనే ప్రయత్నంలో డివైజ్ 10 మీటర్ల దూరంలో ఉన్నా హ్యాకర్ హ్యాక్ చేసి డివైజ్ కనెక్ట్ చేయగలరు. ఏదైనా ఒక డివైజ్ కనెక్ట్ చేసేందుకు హ్యాకర్లు బ్రూట్ ఫోర్స్ ఫెయిర్ చేసేందుకు ఉపయోగిస్తారు. అంటే ప్రాథమికంగా కనెక్టివిటీ కోడ్‌ను క్రాక్ చేసేందుకు ఇలా చేస్తుంటారు. అప్పుడు యూజర్ డివైజ్‌లో అన్ని పాస్‌వర్డ్‌లను క్రాక్ చేస్తారు. మీ ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత, హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారు.
మీ ఫోన్ కాల్‌లు, మెసేజ్‌లకు యాక్సెస్‌ను పొందడానికి కాంటాక్టులను ఎడిట్ చేసేందుకు మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. అంతేకాదు.. మీ బ్యాంకింగ్ యాప్‌ల నుంచి డబ్బు లావాదేవీలు కూడా చేయవచ్చు. అలాగే మీ ఫోన్ నుంచి వారి ప్రైవేట్ వీడియోలను తస్కరిస్తారు. తద్వారా బాధితులకు థ్రెట్ కాల్స్ చేసి మరి బ్లాక్‌మెయిల్ చేయవచ్చు.
Using TWS or Bluetooth devices_ Here’s how you can safeguard yourself from Bluetooth hacking
Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో ఒక్క నెలలోనే 23 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?
బ్లూబగ్గింగ్‌కు ఏ డివైజ్‌ల్లో ఎక్కువ డేంజర్ అంటే? :
బ్లూటూత్‌కు ఇచ్చే ఏదైనా డివైజ్ బ్లూ-బగ్ చేసేందుకు వీలుంది.TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) లేదా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ హెడ్‌ఫోన్‌లు, కాల్‌లను రికార్డ్ చేసే స్మార్ట్‌వాచ్‌లు అన్నీ బ్లూటూత్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఫోన్‌లను TWS లేదా వైర్‌లెస్ డివైజ్‌లతో కనెక్ట్ చేసే యాప్‌ల వినియోగంపై కూడా యూజర్లు అనేక జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీ స్మార్ట్‌ఫోన్‌లకు హ్యాకింగ్ రిస్క్ అధికంగా ఉంటుందని సైబర్ నిపుణులు గమనించాలి.
బ్లూబగ్గింగ్ నుంచి ఎలా ప్రొటెక్షన్ పొందాలంటే? :
* డివైజ్ ఉపయోగంలో లేనప్పుడు మీ బ్లూటూత్‌ని ఎల్లప్పుడూ OFF చేయండి.
* బ్లూటూత్ సెట్టింగ్‌లో ఇతర డివైజ్‌లకు కనిపించే మీ ‘(Device)’ని OFF చేయండి.
* లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో మీ డివైజ్ ఎల్లప్పుడూ Update చేయండి.
* ఓపెన్ పబ్లిక్ Wi-Fiని ఉపయోగించరాదు. గుర్తుతెలియని వైఫై సర్వీసులను కనెక్ట్ చేయకూడదు.
* పబ్లిక్‌గా లేదా తెలియని డివైజ్ ద్వారా బ్లూటూత్ ఫెయిరింగ్ రిక్వెస్ట్ ఎప్పుడూ అనుమతించవద్దు.
* మీరు పబ్లిక్ Wi-Fiని యాక్సెస్ చేసినప్పుడు మీ డివైజ్ రీబూట్ చేయండి లేదా Restart చేయండి.
* మీ బ్లూటూత్ డివైజ్ మీ సొంత పేరుతో పేరు పెట్టకుండా కొత్త పేరును ప్రయత్నించండి.
* మీ డివైజ్ ఎల్లప్పుడూ యాంటీవైరస్ అప్లికేషన్‌ను ఉపయోగించాలి.
* వైరస్, మాల్వేర్ చెక్ చేసేందుకు మీ డివైజ్‌లను క్రమం తప్పకుండా స్కాన్ చేయండి.
* మీ బ్లూటూత్‌లో కనెక్ట్ చేసిన అన్ని డివైజ్‌లను చెక్ చేయండి
* సేవ్ చేసిన డివైజ్‌లు ఉపయోగంలో లేకుంటే వాటిని వెంటనే మీ ఫోన్లో Remove చేయండి.
* బ్లూటూత్ ద్వారా వ్యక్తిగత డేటాను షేర్ చేయకుండా లేదా Transfer చేయకుండా జాగ్రత్త అవసరం.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో ఒక్క నెలలోనే 23 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?