Vakeel Saab Trailer Creating New Records1
Vakeel Saab: జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. అన్నట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ అండ్ లైక్స్‌తో దూసుకుపోతోంది. సోమవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో రిలీజ్ చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Vakeel Saab Trailer : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ ‘వకీల్ సాబ్’.. ట్రైలర్ చితక్కొట్టిందిగా!..
సినిమా రిలీజ్ చేసినంత హంగామా ట్రైలర్ రిలీజ్‌కి చేశారు. పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు.. హిందీ ‘పింక్’, తమిళ్ ‘నేర్కొండ పార్వై’ సినిమాలను మించి తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతుందని హింట్ ఇస్తూ.. ఆకాశాన్నంటే స్థాయిలో అంచనాలు మరింత పెంచేశారు పవర్‌స్టార్.
Vakeel Saab
ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లో 22.44 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి, తెలుగు ఇండస్ట్రీలో అత్యధికమంది చూసిన ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు 23 గంటల 39 నిమిషాల్లో ఒక మిలియన్ లైక్స్ కూడా రాబట్టి రికార్డ్ నెలకొల్పింది. కేవలం ట్రైలర్‌తోనే పవర్‌స్టార్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. ఇక కలెక్షన్ల పరంగా పాత రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది..