Padmavathi
Padmavati Temple : శ్రావణ మాసం నేపధ్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 20వ తేదిన వరలక్ష్మీ వత్రం నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో భక్తులు లేకుండానే ఏకంతంగా నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో భక్తులు వరలక్ష్మీవత్రంలో పాల్గొనేందుకు వీలుగా టీటీడీ టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఈకార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
వరలక్ష్మీ వత్రం వర్చువల్ సేవా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులను ప్రసాదంగా అందించనున్నారు. ఇవన్నీ పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాలకు పంపుతారు. పోస్టల్ చార్జీలతో కలసి టిక్కెట్టు ధరను 1001గా నిర్ణయించారు.
20వ తేది ఉదయం అమ్మవారి మూలవరులకు, ఉత్సవరులకు ఏకంతంగా అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకు శ్రీ కృష్ణ ముఖమండపంలో వరలక్ష్మీ వ్రతం జరగనుంది. వర్చువల్ వ్రత కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు tirupatibalaji.gov.in వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.