×
Ad

Irrfan Khan : వెర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఫస్ట్ డెత్ యానివర్సరీ.. నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు..

నేడు ఇర్ఫాన్ ఖాన్ మొదటి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు..

  • Published On : April 29, 2021 / 11:00 AM IST

Irrfan Khan

Irrfan Khan: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గతేడాది ఏప్రిల్ 29న కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అప్పటికి కొంతకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన లండన్‌లో ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నారు..

మూడు రోజుల వ్యవధిలో రెండు మరణాలు.. శోకసంద్రంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం..

ఇర్ఫాన్ ఖాన్‌కు భార్యా,ఇద్దరు కుమారులు ఉన్నారు.. విషాదం ఏంటంటే.. ఇర్ఫాన్ చనిపోవడానికి మూడు రోజుల ముందు (ఏప్రిల్-26,2020) ఇర్ఫాన్ తల్లి సయూదా బేగమ్ 95ఏళ్ల వయస్సులో జైపూర్‌లో కన్నుమూశారు.. కరోనా లాక్‌డౌన్ కారణంగా అప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ముంబై నుంచి తల్లిని చివరిచూపు చూసేందుకు జైపూర్ వెళ్లలేకపోయారు. వీడియో కాల్ ద్వారా తన తల్లికి నివాళులర్పించారు..

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ Best Movies

తన విలక్షణమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఇర్ఫాన్, ఆయన పోషించిన పలు విభిన్న పాత్రల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు.. బాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్రపరిశ్రమ ఇర్ఫాన్‌ లాంటి మంచి నటుణ్ణి, మంచి వ్యక్తిని బాగా మిస్సవుతుంది.. నేడు ఇర్ఫాన్ ఖాన్ మొదటి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు..