Young Narappa: ‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘నారప్ప’..
తమిళ్ ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నారప్ప’ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇప్పటివరకు ఓల్డ్ గెటప్‌లో కనిపించిన వెంకీ యంగ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నారు వెంకీ మామ.
ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ వేసవి కానుకగా మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్.కె నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం..