vijay varasudu release date announced
Varasudu : తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వారసుడు. తమిళ సినిమాగా తెరకెక్కుతున్న వరిసు తెలుగులో డబ్బింగ్ తో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో దిల్ రాజు ప్రకటించారు. అయితే వారసుడు సినిమాకి వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి.
డబ్బింగ్ సినిమాలకి పండగలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వొద్దని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి నోటీసులిచ్చింది. ఈ నోటీసు కాస్త దిల్ రాజు వర్సెస్ తెలుగు నిర్మాతల మండలి అన్నట్టు మారింది. గతంలో షూటింగ్ ఆపినప్పుడు కూడా నాది తమిళ సినిమా ఆపను అని దిల్ రాజు అనడంతో అప్పుడు కూడా వివాదం చెలరేగింది. ఇటీవల సినిమాలో పర్మిషన్ లేకుండా ఏనుగులు వాడారని యానిమల్ బోర్డు అఫ్ ఇండియా నోటీసులు కూడా ఇచ్చింది ఈ చిత్ర యూనిట్ కి. ఇలా వరుసగా వివాదాలు వెంటాడుతున్నా, ఎవరు ఏమన్నా దిల్ రాజు మాత్రం తగ్గేదే లేదు అంటూ సంక్రాంతికే రిలీజ్ చేస్తా అంటున్నాడు.
తెలుగులో ఇప్పటికే ఇద్దరి సీనియర్ స్టార్ హీరోలు సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, బాలకృష్ణ వీరసింహ రెడ్డితో రానున్నారు. వీటి మధ్య వారసుడు రిలీజ్ చేస్తా అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు దిల్ రాజు. అయితే ఇప్పటివరకు సంక్రాంతికి వస్తామని చెప్పినా ఏ సినిమా డేట్ ఫిక్స్ చేయలేదు. తాజాగా దిల్ రాజు వారసుడు రిలీజ్ డేట్ చెప్పేసి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసేశాడు. వారసుడు సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చిత్ర యూనిట్ చేశారు.
Lady Oriented Movies : లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యూ కడుతున్న హీరోయిన్స్..
దీంతో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తమిళ్ లో విజయ్ సినిమా ఎలా ఉన్నా ఆడుతుంది. కానీ తెలుగులో ఇద్దరు మెయిన్ హీరోల భారీ సినిమాల మధ్య రిలీజ్ చేస్తే వారసుడు నిలబడుతుందా అని ఆలోచిస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. మరి ఈ సంక్రాంతికి ఏమవుతుందో చూడాలి.
Witness the 'T' Rage On 12.01.2023 ??#Varisu /#Vaarasudu North America ?? ?? release by @ShlokaEnts#VarisuPongal #Thalapathy @actorvijay @iamRashmika @MusicThaman @SVC_official @PVPCinema @PharsFilm @trendytollyPR pic.twitter.com/n7HUExkp6d
— Shloka Entertainments (@ShlokaEnts) November 30, 2022