Manchu Vishnu : వారి మద్దతుతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం..!

‘మా’ సభ్యుల సంక్షేమం కోసం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి.. ఇవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు..

  • Updated on- June 22, 2021 / 12:58 PM IST

Manchu Vishnu1

Manchu Vishnu: తెలుగు చిత్రపరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఈసారి ‘మా’ అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటంతో ఎన్నికలపై ఎప్పటిలానే హైప్ క్రియేట్ అవుతోంది. కొత్త తరం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘మా’ ఎలక్షన్స్‌కు సంబంధించి పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు. తండ్రి, డా. మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటీనటులు విష్ణు నిర్ణయానికి మద్దతు తెలపడంతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

MAA Elections : రసవత్తరంగా ‘మా’ ఎలక్షన్స్.. అధ్యక్ష పదవికి మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ పోటీ..!

‘మా’ సభ్యుల సంక్షేమం కోసం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి.. ఇవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. తండ్రి మోహన్ బాబు, విష్ణుకి అన్నిరకాలుగా అండగా నిలుస్తూ.. ‘మా’ ఎన్నికల్లో విష్ణు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

విష్ణుకు పోటీగా ప్రకాష్ రాజ్..
వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్.. విష్ణుకు పోటీగా, ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్‌కు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుణ్ణి అయితే సొంత భవనం నిర్మిస్తానని, ‘మా’ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్ రాజ్‌కి పూర్తి మద్దతు ఇచ్చారు. విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీతో ‘మా’ లో రాజకీయం వేడెక్కింది.