Waltair Veerayya First Single Is Getting Ready
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా, చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Waltair Veerayya: మెగా మాస్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న వీరయ్య..?
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ మోషన్ పోస్టర్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పోస్ట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ అదిరిపోయే విధంగా రాబోతుందని, బాస్ పార్టీ మామూలుగా ఉండదని ఆయన పేర్కొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి దీనికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..
కాగా, ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ పక్కా మాస్ సాంగ్‌గా ఉండబోతుండగా, ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్ పక్కన చిందులు వేయనుందట. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.