Waltair Veerayya: మెగా మాస్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న వీరయ్య..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Waltair Veerayya: మెగా మాస్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న వీరయ్య..?

Waltair Veerayya To Give A Mass Treat Soon`

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌‌లో మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ పుట్టినరోజు వేడుకలు..

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర అల్టిమేట్ మాస్‌గా ఉంటుందని, ఈ పాత్రలో చిరు చెలరేగిపోయి పర్ఫార్మ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అటు మరో మాస్ హీరో రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో వీరిద్దరి కలయికలో రాబయే సీన్స్ ఎలా ఉంటాయా అని అప్పుడే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే మాస్ ట్రీట్‌ను అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ని ఢీ కొట్టడానికి సిద్దమవుతున్న తమిళ నటుడు..

అయితే ఈ మాస్ ట్రీట్ ఏమిటా అని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ మాస్ పాటలో చిరు, రవితేజలతో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చిందులు వేయనుండటంతో ఈ సాంగ్‌కు సంబంధించే ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వాల్తేరు వీరయ్య సినిమా నుండి రాబోయే ఆ మాస్ ట్రీట్ ఏమిటో చూడాలి.