Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌‌లో మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ పుట్టినరోజు వేడుకలు..

టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ డైరెక్షన్ లో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా నేడు (ఆదివారం) దర్శకుడు మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ బర్త్ డే కావడంతో.. చిత్ర యూనిట్ సమక్షంలో సెలెబ్రేట్ చేసుకున్నారు వీరిద్దరూ.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌‌లో మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ పుట్టినరోజు వేడుకలు..

Meher Ramesh Birthday Celebrations in Bhola Shankar Sets

Waltair Veerayya: టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ డైరెక్షన్ లో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా నేడు (ఆదివారం) దర్శకుడు మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ బర్త్ డే కావడంతో.. చిత్ర యూనిట్ సమక్షంలో సెలెబ్రేట్ చేసుకున్నారు వీరిద్దరూ.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ని ఢీ కొట్టడానికి సిద్దమవుతున్న తమిళ నటుడు..

ఈ వేడుకల్లో చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ, యాక్టర్ సత్యదేవ్, గెటప్ శీను, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మూవీ టీంకి కృతజ్ఞతలు తెలిపాడు డైరెక్టర్ మెహర్ రమేష్. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న మరో మాస్ మసాలా చిత్రం “భోళాశంకర్”. హీరో అజిత్ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా రాబోతుంది.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. మణిశర్మ తనయుడు ‘మహతి స్వర సాగర్’ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు మెగాస్టార్. ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో వరుసగా మూడు నెలల గ్యాప్ తో అభిమానులను అలరిస్తున్నాడు చిరంజీవి.